ETV Bharat / bharat

'పెగసస్​'పై చర్చకు పట్టు- హోరెత్తిన ఉభయ సభలు - వెంకయ్య నాయుడు

పెగసస్​, సాగు చట్టాలు సహా ఇతర అంశాలపై విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. వర్షాకాల సమావేశాల 8వ రోజు కూడా నిరసనలు కొనసాగడం వల్ల వాయిదాల పర్వం కొనసాగింది. విపక్షాల నిరసనల మధ్యే.. 202- ఫ్యాక్టోరింగ్​ నియంత్రణ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది రాజ్యసభ.

Parliament
పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు
author img

By

Published : Jul 29, 2021, 3:38 PM IST

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో భాగంగా 8వ రోజు కూడా విపక్షాల నిరసనలతో ఉభయ సభలు హోరెత్తాయి. పెగసస్​, సాగు చట్టాలపై చర్చకు పట్టుపట్టాయి. నిరసనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది.

లోక్​సభలో..

లోక్​సభ ప్రారంభం కాగానే స్పీకర్​ ఓం బిర్లా బుధువారం సభలో జరిగిన సంఘటనలపై విచారం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు కాగితాలు చించి స్పీకర్​ స్థానం వైపు విసరడం తనను బాధించిందని అన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసి.. సభ్యులంతా సభ గౌరవాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మాట్లాడిన కాంగ్రెస్​ పక్ష నేత అధీర్​ రంజన్​ .. ప్రభుత్వ మొండి వైఖరి వల్ల విపక్షాలు తమ వాదనను వినిపించలేకపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి.. బుధవారం కాగితాలు చింపి విరిసిన సభ్యులు క్షమాపణ చెప్పాలని కోరుకోవడం లేదని విమర్శించారు. దీనిపై విపక్షాలు ఆందళనకు దిగగా.. సభను 11.30 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్​.

తిరిగి ప్రారంభమైన తర్వాత పెగసస్​, సాగు చట్టాలకు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ప్రశ్నోత్తరాల అనంతరం ప్యానెల్​ స్పీకర్​ రాజేంద్ర అగర్వాల్​ శూన్య గంటను చేపట్టేందుకు సిద్ధం కాగా, విపక్షాలు నినాదాలతో సభను హోరెత్తించాయి. దీంతో సభను 12.30 గంటల వరకు రెండోసారి, 2 గంటల వరకు మూడోసారి వాయిదా వేశారు. విపక్షాల ఆందోళనలకు అడ్డుకట్ట పడకపోవటం వల్ల లోక్​సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

రాజ్యసభలో..

రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళన కొనసాగింది. సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే.. పెగసస్​ సహా తాము లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు వీలుగా రోజువారీ కార్యకలాపాలను రద్దు చేయాలని విపక్షాలు ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నట్లు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్​ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తృణమూల్​ కాంగ్రెస్​ సభ్యులు వెల్​లోకి వచ్చి నిరసన తెలపగా, కాంగ్రెస్​ సభ్యులు కూడా వారితో జత కలిశారు. వెనక్కి వెళ్లాలని ఛైర్మన్​ విజ్ఞప్తి చేయగా..విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఈ దశలో చట్టసభ్యుల ప్రవర్తనపై బుధవారం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను వెంకయ్య గుర్తు చేశారు. అయినా విపక్షాలు శాంతించకపోవటం వల్ల సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ఆందోళనను కొనసాగించగా.. సభను 2 గంటల వరకు వాయిదా వేశారు.

నిరసనలతో సభా కార్యకలాపాలకు అడ్డుపడటంపై ఆందోళన వ్యక్తం చేశారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. దాని ద్వారా 90 మంది సభ్యులు అందించిన ప్రజాప్రయోజనాల నోటీసులను అంగీకరించినా.. వారికి సభలో చర్చించే అవకాశం రాకపోవటం బాధాకరమన్నారు. మొత్తం 69 జీరో హవర్​ అంశాలు ఉండగా.. అందులో ఇవాళ 12 అంశాలపై చర్చించాల్సి ఉందన్నారు. 23 ప్రత్యేక అంశాలు ఉన్నప్పటికీ వాటిపైనా చర్చించలేకపోయమన్నారు.

బిల్లుకు ఆమోదం..

సభ ప్రారంభమైన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. 202- ఫ్యాక్టోరింగ్​ నియంత్రణ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనల మధ్యే రాజ్యసభ ఆ బిల్లుకు ఆమోదం తెలిపింది.

విపక్షాల నిరసనలు కొనసాగిన క్రమంలో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

ఇదీ చూడండి: ప్రజాస్వామ్యంపై నిఘానేత్రం.. కఠిన ఆంక్షలతోనే అడ్డుకట్ట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.