ETV Bharat / bharat

ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

PARLIAMENT LIVE
పార్లమెంట్ సమావేశాలు
author img

By

Published : Jul 20, 2021, 11:10 AM IST

Updated : Jul 20, 2021, 7:00 PM IST

18:59 July 20

కొవిడ్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి  ఉభయ సభల్లోని  పలు పార్టీ పక్ష నేతలు హాజరయ్యారు.  

అయితే ఈ సమావేశానికి హాజరు కావద్దని కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌ నిర్ణయించాయి. తాము సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేయడం లేదని, గైర్హాజరు మాత్రమే అవుతున్నామని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే వివరించారు.  

18:17 July 20

రాజ్యసభను ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఛైర్మన్​ వెంకయ్యనాయుడు.

15:08 July 20

లోక్​సభ తిరిగి 3 గంటలకు ప్రారంభమైంది.  ఈ క్రమంలో విపక్షాలు ఆందోళనలు కొనసాగించారు. దీంతో స్పీకర్​ సభను ఎల్లుండి( జులై 22)కి వాయిదా వేశారు. 

14:20 July 20

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్​సభలో విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. దీంతో సభను మరోసారి మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు స్పీకర్​.

మరోవైపు రాజ్యసభ సజావుగా సాగుతోంది. కరోనా అంశంపై చర్చ జరుగుతోంది.

13:24 July 20

రెండు సార్లు వాయిదా పడ్డ రాజ్యసభ.. ఒంటిగంటకు తిరిగి సమావేశమైంది. కరోనాపై చర్చించేందుకు విపక్ష సభ్యులంతా సహకరించాలని కేంద్ర మంత్రి, రాజ్యసభలో అధికారపక్ష నేత పీయూష్ గోయల్ విజ్ఞప్తి చేశారు. 

అయినప్పటికీ.. సభ్యులు తమ ఆందోళనలను కొనసాగించారు. నినాదాలు చేస్తూ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. ఈ ఆందోళనల మధ్య సభను కొనసాగించినప్పటికీ.. కొద్దిసేపు తర్వాత వాయిదా వేస్తూ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ నిర్ణయం తీసుకున్నారు. 15 నిమిషాల తర్వాత భేటీ కానున్నట్లు తెలిపారు.

12:05 July 20

రాజ్యసభ రెండోసారి

మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమైన రాజ్యసభ.. మరోసారి వాయిదా పడింది. సభ్యులు ఎంతటికీ శాంతించకపోవడం వల్ల.. సభను డిప్యూటీ ఛైర్మన్ ఒంటి గంట వరకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం కరోనాపై చర్చ జరుగుతుందని తెలిపారు.

11:08 July 20

పార్లమెంటులో 'పెగాసస్' రగడ - ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్ష సభ్యుల ఆందోళనలు రెండోరోజూ కొనసాగాయి. పెగాసస్ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ ఉభయ సభల్లో సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే.. రెండు సభలు వాయిదా పడ్డాయి.

లోక్​సభలో స్పీకర్ వెల్​లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు విపక్ష సభ్యులు. చర్చకు సహకరించాలని స్పీకర్ ఓంబిర్లా వారించినప్పటికీ పరిస్థితి మారకపోవడం వల్ల.. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు, రాజ్యసభలోనూ కార్యకలాపాలు సజావుగా సాగలేదు. పలువురు సభ్యులు ఆందోళనలకు దిగడం వల్ల సభను వాయిదా వేయక తప్పలేదు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశం కానున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

Last Updated : Jul 20, 2021, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.