Parliament monsoon session live : మణిపుర్ అంశంపై చర్చించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్ష కూటమికి, అధికార పక్షానికి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. పాలక, విపక్షాల మధ్య వాగ్యుద్ధంతో పార్లమెంట్లో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చించకుండా పార్లమెంట్‌ను మోదీ సర్కారు అవమానిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర సమస్యలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి పార్లమెంట్ బయట వ్యాఖ్యానించారు.
"ప్రభుత్వం ముందుగా అవిశ్వాస తీర్మానంపై చర్చించాలి. సభలో ఇతర కార్యకలాపాలకు మేం వ్యతిరేకం కాదు. కానీ, అవిశ్వాస తీర్మానంపైనే ముందుగా చర్చ జరగాలి. అవిశ్వాస తీర్మానానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దీనిపై నోటీసులు ఇచ్చిన సమయంలో బిల్లులు, పాలసీలు తీసుకొచ్చి పార్లమెంట్‌ను ప్రభుత్వం అవమానిస్తోంది. అవిశ్వాస తీర్మానాన్ని పక్కనబెట్టి ఇతర అంశాలపై చర్చ జరపడం గతంలో ఎన్నడూ చూడలేదు."
-అధీర్ రంజన్ చౌదరి, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత
-
#WATCH | Delhi: Congress MP Adhir Ranjan Chowdhary says, "An all-party should visit Manipur and analyse the situation in the state. We are ready to have discussions on Bihar and West Bengal as well. We have brought the no-confidence motion and the govt should have discussions on… pic.twitter.com/ZzmfvxfEZN
— ANI (@ANI) July 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Delhi: Congress MP Adhir Ranjan Chowdhary says, "An all-party should visit Manipur and analyse the situation in the state. We are ready to have discussions on Bihar and West Bengal as well. We have brought the no-confidence motion and the govt should have discussions on… pic.twitter.com/ZzmfvxfEZN
— ANI (@ANI) July 31, 2023#WATCH | Delhi: Congress MP Adhir Ranjan Chowdhary says, "An all-party should visit Manipur and analyse the situation in the state. We are ready to have discussions on Bihar and West Bengal as well. We have brought the no-confidence motion and the govt should have discussions on… pic.twitter.com/ZzmfvxfEZN
— ANI (@ANI) July 31, 2023
Congress vs BJP in India : విపక్ష కూటమి ఎంపీలతో కలిసి మణిపుర్‌ను సందర్శించిన అధీర్.. అక్కడ పరిస్థితి భయంకరంగా ఉందని అన్నారు. మణిపుర్ పరిస్థితిని అర్థం చేసుకునేందుకు అధికార పార్టీ ఎంపీలు ఆ రాష్ట్రాన్ని సందర్శించాలని సూచించారు.
Kharge on PM Modi Manipur : మణిపుర్ అంశంపై చర్చించేందుకు ప్రధానికి సమయం లేనట్లుగా కనిపిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. 'ప్రచారం కోసం రైళ్లను ప్రారంభించడానికి, ఎన్నికల ర్యాలీలు- బీజేపీ సమావేశాల్లో పాల్గొనడానికి మోదీకి సమయం ఉంది. కానీ మణిపుర్ ప్రజల వేదనపై మాట్లాడేందుకు మోదీకి సమయం ఉండదు. మణిపుర్ పరిస్థితిని చక్కదిద్దే పరిష్కారమేదీ లేనట్లుగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పార్లమెంట్లో సమగ్ర ప్రకటన ఇవ్వకపోవడమే ఇందుకు సాక్ష్యం' అని ఖర్గే ట్వీట్ చేశారు.
"10 వేల మంది చిన్నారులు సహా 50 వేల మంది మణిపుర్ ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రిలీఫ్ క్యాంపుల్లో మహిళలకు సరైన సదుపాయాలు లేవు. ఔషధాలు, ఆహారం తగినంతగా లభించడం లేదు. ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. చిన్నారులు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారు. రైతులు వ్యవసాయం ఆపేశారు. ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిళ్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు."
-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
పార్లమెంట్లో విపక్షాల ఆందోళనలతో సోమవారం వాయిదాల పర్వం కొనసాగింది. మణిపుర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని విపక్షాల ఆందోళనలతో కార్యకలాపాలు సజావుగా సాగలేదు. ఆఫ్రికాలోని మలావీ దేశ పార్లమెంటరీ బృందం.. భారత పార్లమెంట్ కార్యకలాపాలను వీక్షించేందుకు వచ్చారని స్పీకర్ ఓంబిర్లా ఉదయం 11 గంటలకు ప్రకటించారు. వారికి ఆహ్వానం పలుకుతూ భారత పర్యటన విజయవంతంగా సాగాలని పేర్కొన్నారు. అయితే, స్పీకర్ ప్రసంగం పూర్తికాగానే విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ దద్దరిల్లింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ఫలితంగా సభ ప్రారంభమైన 15 నిమిషాలకే వాయిదా పడింది.
'చర్చకు మేం రెడీ'
అంతకుముందు సభలో మాట్లాడిన రాజ్యసభ నాయకుడు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. మణిపుర్ అంశంపై మధ్యాహ్నం 2 గంటలకు చర్చ చేపట్టాలని ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. రూల్ 176 ప్రకారం చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. విపక్షాలే చర్చ నుంచి పారిపోతున్నాయని, తొమ్మిది రోజులుగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు ప్రభుత్వం సిద్ధమేనని సభ బయట మరోసారి స్పష్టం చేశారు.
-
#WATCH | Leader of the House in Rajya Sabha, Piyush Goyal says, "We have clearly said to the Rajya Sabha Chairman Speaker that whenever he wants, we are ready to have discussions on Manipur. We are requesting the Opposition to have discussions for 10 days. The Opposition is… pic.twitter.com/d8NedJ8Wqq
— ANI (@ANI) July 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Leader of the House in Rajya Sabha, Piyush Goyal says, "We have clearly said to the Rajya Sabha Chairman Speaker that whenever he wants, we are ready to have discussions on Manipur. We are requesting the Opposition to have discussions for 10 days. The Opposition is… pic.twitter.com/d8NedJ8Wqq
— ANI (@ANI) July 31, 2023#WATCH | Leader of the House in Rajya Sabha, Piyush Goyal says, "We have clearly said to the Rajya Sabha Chairman Speaker that whenever he wants, we are ready to have discussions on Manipur. We are requesting the Opposition to have discussions for 10 days. The Opposition is… pic.twitter.com/d8NedJ8Wqq
— ANI (@ANI) July 31, 2023
"మణిపుర్‌పై ఎప్పుడు చర్చ జరిపినా తాము సిద్ధమేనని రాజ్యసభ ఛైర్మన్‌కు మేం స్పష్టంగా చెప్పాం. మణిపుర్‌పై చర్చిద్దామని 10 రోజులుగా విపక్షాలను మేం కోరుతున్నాం. విపక్ష పార్టీలు దేనికో భయపడుతున్నట్లు ఉన్నాయి. అందుకే చర్చ నుంచి పారిపోతున్నాయి."
-పీయూష్ గోయల్, రాజ్యసభ నాయకుడు
అయితే, మణిపుర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించినా.. విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. రూల్ 267 ప్రకారం సమగ్ర చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. ఆ నిబంధన అరుదుగానే చర్చలు జరుగుతాయని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ పేర్కొనగా.. విపక్ష ఎంపీలు నినాదాలు మరింత ఉద్ధృతం చేశారు.
మరోవైపు, ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్ లీడర్లు మణిపుర్‌ను సందర్శించిన ఎంపీలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీకి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ఉభయ సభల్లో అనుసరించే వ్యూహాలపై వీరంతా చర్చించారు.