ETV Bharat / bharat

జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు- ఫిబ్రవరి 1న పద్దు- రైతులకు శుభవార్త ఉంటుందా?

Parliament Budget Session 2024 : పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 9 వరకు జరగనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఫిబ్రవరి 1 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారని వెల్లడించారు.

Parliament Budget Session 2024
Parliament Budget Session 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 3:11 PM IST

Updated : Jan 12, 2024, 3:45 PM IST

Parliament Budget Session 2024 Date : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌- మేలో పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. జనవరి 31న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్​ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీంతో అధికారికంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.

ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చే చివరి పద్దు ఇదే. లోక్​సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈసారి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు చేయాల్సిన ఖర్చులకు పార్లమెంట్‌ ఆమోదం తీసుకోవడమే. ఈ సంప్రదాయం బ్రిటిష్‌ కాలం నుంచి కొనసాగుతోంది. అయితే ఈ బడ్జెట్​లో ఆకర్షణీయమైన ప్రకటనలు, విధానపరంగా కీలకమైన మార్పులు ఉండకపోవచ్చని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సంకేతాలిచ్చారు.

Economic Survey Report 2025 : ఈ మధ్యంతర బడ్జెట్​లో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు మహిళా రైతులకు శుభవార్త చెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీరికి ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి మొత్తాన్ని రెట్టింపు చేసే ప్రతిపాదనలు ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ప్రభుత్వం అదనంగా రూ.12,000 భారం పడనుంది. దీనిపై బడ్జెట్​లో వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ప్రతి ఏడాది బడ్జెట్​ సందర్భంగా ప్రభుత్వం ఆర్థిక సర్వేను చేపడుతుంది. కానీ ఈసారి క్లుప్తంగా 2024-2025 ఆర్థిక నివేదకను విడుదల చేయనుంది.
17వ లోక్‌సభ కాలపరిమితి జూన్‌ 16వ తేదీతో ముగుస్తుంది. సార్వత్రిక ఎన్నికల కంటే ముందు ఇదే చివరి పార్లమెంట్‌ సమావేశాలు. 2019లో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో జరిగాయి.

లోక్​సభ ఘటన- పాలీగ్రాఫ్​ టెస్ట్​కు ఐదుగురు ఓకే- ఆ ఒక్కడు మాత్రం!

మూడు క్రిమినల్​ బిల్లులకు ఆమోదం- పార్లమెంట్​ నిరవధిక వాయిదా

Last Updated : Jan 12, 2024, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.