అంతర్జాలం ద్వారా వినియోగదారులకు నేరుగా అందించే మీడియా సేవలను(ఓటీటీ), సామాజిక మాధ్యమాల వేదికలను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త నిబంధనల చట్టబద్ధతను.. పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాలు, స్ట్రీమింగ్, సంస్థలకు సంబంధించి కేంద్రం గత నెల మధ్యంతర మార్గదర్శకాలనూ, డిజిటల్ మీడియా ప్రవర్తనా నియమావళినీ అందుబాటులోకి తెచ్చింది. వాట్సప్, ఫేస్బుక్, ట్విటర్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో తదితర వేదికలు వీటిని అనుసరించాలని పేర్కొంది.
ఈ క్రమంలో సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్-సమాచార సాంకేతిక శాఖల ఉన్నతాధికారులు సంబంధిత పార్లమెంటరీ స్థాయీ సంఘంతో సోమవారం భేటీ అయ్యారు. శశిథరూర్ నేతృత్వంలోని ఈ సంఘం వారికి పలు కీలక ప్రశ్నలు సంధించింది.
ఇదీ చదవండి:పొడవైన రంగోలీ.. పోలింగ్కు చూపించే దారి