పార్లమెంట్ స్థాయి సంఘాలకు(Parliamentary Committees) ఛైర్మన్లు, సభ్యులను నియమిస్తూ లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు ప్రకటన విడుదల చేశాయి. కాంగ్రెస్ నేత శశిథరూర్ సమాచార, సాంకేతిక విభాగం స్టాండింగ్ కమిటీకి అధిపతిగా కొనసాగనున్నారు. హోమ్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్‌గా ఆనంద్ శర్మ, సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఛైర్మన్‌గా జైరాం రమేష్ కొనసాగిస్తున్నట్లు తెలిపాయి.
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడును సంప్రదించిన తర్వాత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వివిధ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను పునర్నిర్మించారు. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా రాంగోపాల్ యాదవ్, రక్షణ వ్యవహారాల కమిటి ఛైర్మన్‌గా జోయల్ ఓరం, ఎనర్జీ కమిటీ ఛైర్మన్‌గా రాజీవ్ రంజన్ సింగ్‌ను నియమించారు. నీటి వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా సంజయ్ జైస్వాల్, బొగ్గు, ఉక్కు వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా రాకేష్ సింగ్, పట్టణ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా జగదాంబికాపాల్‌లను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చూడండి: Delhi power crisis: దిల్లీలో ఇక రెండు రోజులే.. ఆ తర్వాత!