పెగసస్ గూఢచర్యం కేసును విచారించేందుకు న్యాయకమిషన్ నియామకంపై సుప్రీంకోర్టుకు(pegasus sc hearing) బంగాల్ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఈ వ్యవహారంపై విచారణ జరిగే వరకు.. విచారణ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోదని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
బంగాల్ సర్కారు నియమించిన కమిషన్‌ను రద్దు చేయాలని ఓ ఎన్జీఓ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇలాంటి విషయాలపై దర్యాప్తు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని పేర్కొంది. దీనిపై ఇదివరకే విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేంద్రంతో పాటు దీదీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనికి స్పందనగా బంగాల్ సర్కారు తాజాగా వివరణ ఇచ్చింది.
'పిటిషనర్ ఆరెస్సెస్ సన్నిహితులు'
అంతకుముందు విచారణలో భాగంగా.. బెంగాల్ ప్రభుత్వం నియమించిన న్యాయకమిషన్‌ను రద్దు చేయాలని సీజేఐ ధర్మాసనాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే అభ్యర్థించారు. అయితే, పిటిషనర్ ఆరెస్సెస్‌కు సన్నిహితులు అన్న విషయాన్ని గుర్తించాలని, ప్రభుత్వం దాఖలు చేసిన సమాధానాన్ని పరిగణలోకి తీసుకోవాలని బంగాల్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు.
కాగా, ఈ పిటిషన్‌ను పెగసస్‌పై దాఖలైన ఇతర వ్యాజ్యాలతో కలపకూడదన్న సాల్వే విజ్ఞప్తిని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తోసిపుచ్చారు. బంగాల్ న్యాయకమిషన్ పిటిషన్‌ని ప్రధాన పిటిషన్లకు జత చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని పిటిషన్లపైనా సమగ్రంగా విచారణ జరపనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: