ETV Bharat / bharat

అత్తారింటికి హెలికాప్టర్​లో వచ్చిన కోడలు - ఉత్తర్​ప్రదేశ్​ వార్తలు తాజా

ఉత్తర్​ప్రదేశ్​లోని బదాయూ​కు చెందిన ఓ మహిళ తన అత్తవారింటి గ్రామానికి హెలికాప్టర్​లో వచ్చింది. ఇటీవల ఆ గ్రామానికి సర్పంచిగా ఎన్నికైన ఆమెకు గ్రామస్థులు స్వాగతం పలికారు. శనివారమే ఆమె వివాహం జరిగింది.

The newly elected village head arrived
అత్తింటికి హెలికాప్టర్​లో వచ్చిన కోడలు
author img

By

Published : Jul 6, 2021, 11:02 AM IST

Updated : Jul 6, 2021, 11:58 AM IST

అత్తింటికి హెలికాప్టర్​లో వచ్చిన కోడలు

ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీకి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న ఓ మహిళ.. అత్తవారింటికి వచ్చిన తీరు స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. బదౌన్​ ప్రాంతానికి చెందిన సునీత వర్మా.. సోమవారం ఆమె అత్తవారి గ్రామం అయిన అలంపుర్​ కోట్​కు హెలికాప్టర్​లో చేరుకున్నారు. సునీత.. ఇటీవల అలంపుర్​ కోట్​ గ్రామ సర్పంచిగా కూడా ఎన్నికయ్యారు. కొత్త సర్పంచ్​ను గ్రామస్థులు స్వాగతించారు.

బదౌన్​ గ్రామానికి చెందిన వేద్రామ్​ లోధీ కుమార్తె అయిన సునీత వర్మా.. అలంపుర్​కు చెందిన ఒమేంద్ర సింగ్​ను గత ఏడాది డిసెంబరులో రిజిస్టర్​ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత స్థానికంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామ సర్పంచి పదవికి నామినేషన్​ దాఖలు చేయగా ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు.

గ్రామ సర్పంచిగా నామినేషన్​ దాఖలు చేయడానికి ఆ గ్రామంలో ఓటు హక్కు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టే సునీత.. ఒమేంద్ర​ సింగ్​ను వివాహం చేసుకుందని అలంపుర్​ గ్రామస్థులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో సునీత పాల్గొనలేదని.. ఆమె తరపున భర్త ఒమేంద్ర​ ప్రచారం చేశారని తెలిపారు.

ఇప్పుడు మళ్లీ సంప్రదాయాలను అనుసరించి.. శనివారం మరోసారి సునీత-ఒమేంద్ర​లు వివాహం జరుపుకొన్నారు. సోమవారం హెలికాప్టర్​లో అలంపుర్​కు సునీత చేరుకున్నారు.

ఇదీ చూడండి : Viral: నడిరోడ్డుపై గొడవ- తుపాకీ తీసి కాల్చుతానని బెదిరింపు

Last Updated : Jul 6, 2021, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.