ETV Bharat / bharat

ప్రజా 'పరీక్ష'లో పళనిస్వామి పాస్​ అయ్యేనా? - తమిళనాడు ఎన్నికలు 2021

శశికళ మద్దతుతో పన్నీర్​సెల్వంపై 'ధర్మయుద్ధం' గెలిచి.. తమిళనాడు సీఎంగా ఇటీవలే నాలుగేళ్ల పాలనను పూర్తిచేస్తున్నారు పళనిస్వామి. ఇన్నేళ్లు ఆయన అధికారంలో ఉండటం అనేకమందిని ఆశ్చర్యపరిచింది. ఆ స్థాయిలో విమర్శలు, ఆరోపణలు, వివాదాలను ఎదుర్కొన్నారాయన. మరి రానున్న ఎన్నికల్లో గెలిచి.. మరోమారు సీఎం పీఠాన్ని అధిరోహిస్తారా? ప్రజలు తిరిగి ఆయన్ను ఎన్నుకుంటారా?

Palaniswami completes four years in office and miles to go as a leader.
కష్టాల వారధిలో పళనిస్వామి అడుగులు.. గెలిచేనా?
author img

By

Published : Mar 11, 2021, 5:07 PM IST

ఎడప్పడి కె. పళనిస్వామి.. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి. సీఎంగా ఇటీవలే నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు ఆయన. వాస్తవానికి పళనిస్వామి ఇన్నేళ్లు అధికారంలో ఉండటం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడులో 'అమ్మ'గా కొలిచే జయలలిత మరణం అనంతరం సీఎం బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఎక్కువ రోజులు ఉండలేరని చాలా మంది అనుకున్నారు. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇన్ని సంవత్సరాలు పదవిలో కొనసాగారు. మరి నాలుగేళ్లుగా ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న పళనిస్వామికి.. ప్రజలు ఈసారి ఓటువేస్తారా? అన్నాడీఎంకేను తిరిగి అధికార పీఠంపై కూర్చోపెడతారా?

Palaniswami completes four years in office and miles to go as a leader.
సీఎం పళనిస్వామి

అమ్మ మరణంతో..

నాటి ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2016లో మరణించారు. అనంతరం ప్రస్తుత డిప్యూటీ సీఎం ఓ. పన్నీర్​సెల్వం.. రెండు నెలల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కానీ జయ సన్నిహితురాలు శశికళ అండతో 2017 ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు పళనిస్వామి. పన్నీర్​సెల్వంతో జరిగిన 'ధర్మ యుద్ధం'లో విజయం పళనిస్వామినే వరించింది.

పన్నీర్​సెల్వం-పళనిస్వామి

ఇదీ చూడండి:- తమిళనాట 'రాజకీయ శూన్యత' నిజమా? భ్రమా?

పదవి చేపట్టిన తొలినాళ్ల నుంచే పళనిస్వామికి ఎన్నో విమర్శలు, అనేక అంశాల్లో వ్యతిరేకత ఎదురైంది. అన్నాడీఎంకే ప్రభుత్వం నాలుగు నెలల్లోనే కుప్పకూలుతుందని డీఎంకే అధినేత స్టాలిన్​ అప్పట్లో ధీమా వ్యక్తం చేశారు. అటు ఏఎంఏంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్​ కూడా అన్నాడీఎంకేపై విరుచుకుపడ్డారు. అధికార పార్టీలోని 'స్లీపర్​ సెల్స్​' సహాయంతో ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించారు.

ఇన్ని సమస్యల మధ్య పళనిస్వామి ప్రభుత్వం నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఇందులో ఎన్నో ఘనతలు, వివాదాలు, వైఫల్యాలు ఉన్నాయి.

రిజర్వేషన్​.. ఉచిత టీకా..

ఎంబీబీఎస్​, బీడీఎస్​ అడ్మిషన్లలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5శాతం రిజర్వేషన్​ ప్రకటించింది అన్నాడీఎంకే ప్రభుత్వం. ఇది పళనిస్వామి పాలనలో సాహసోపేత నిర్ణయం. ఎన్నో ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న కావేరీ వివాదాన్ని పరిష్కరించింది. రైతు రుణాలను భారీగా మాఫీ చేసింది. వంతెనలు నిర్మించింది. నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టింది. కరోనా లాక్​డౌన్​ వేళ ప్రజల రక్షణను చూసుకుంది పళనిస్వామి ప్రభుత్వం. తమ ప్రజలకు ఉచిత కరోనా టీకా ప్రకటించిన తొలి రాష్ట్రంగా నిలిచింది.

ఓ సాగు నీటి ప్రాజెక్టు వద్ద...

వైద్య విద్యార్థులతో పళనిస్వామి

తూత్తుకుడి ఘటన...

నాలుగేళ్ల అన్నాడీఎంకే పాలనలో ఘనతల కన్నా వివాదాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. భాజపాతో ఉన్న పొత్తు ఇందుకు ముఖ్య కారణం. కమలదళంతో స్నేహం కోసం.. రాష్ట్ర ప్రజల హక్కులను అన్నాడీఎంకే త్యాగం చేసిందని డీఎంకే ఆరోపించింది.

అదే సమయంలో.. జయలలిత వ్యతిరేకించిన పథకాలను పళనిస్వామి-పన్నీర్​సెల్వం ప్రవేశపెట్టడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.

తూత్తుకుడి హింస

ఇదీ చూడండి:- 'సీఏఏ నిరసనలు, లాక్​డౌన్​ ఉల్లంఘనల కేసులు ఎత్తివేత'

2018 మే 22న తూత్తుకుడి స్టెరిలైట్​ పరిశ్రమలో జరిగిన హింస.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపగా.. 13 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. దీనిపై పళనిస్వామి స్పందించిన తీరు కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. 'ఈ ఘటన గురించి నేను కూడా టీవీలో చూసే తెలుసుకున్నాను. విద్రోహ శక్తులపై చర్యలు చేపట్టడం పోలీసులకు సహజమైన విషయం,' అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై ప్రజలు, సామాజిక కార్యకర్తలు, విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

2017 డిసెంబర్​లో వచ్చిన ఒఖి తుపానుతో కన్యాకుమారి అతలాకులమైంది. సహాయక చర్యలు, సహాయం విషయంలోనే విమర్శలు ఎదుర్కొంది అధికారపక్షం. 2018 గజ తుపాను సమయంలోనూ ఇదే పరిస్థితి.

బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా..

కానీ.. తాము అన్ని విధాలుగా ప్రజలకు అండగా నిలిచామని అన్నాడీఎంకే నేతలు చెప్పుకున్నారు. కానీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

పొల్లాచ్చి కేసు...

నాలుగేళ్ల పళనిస్వామి పాలనలో వైఫల్యాలు ఎక్కువేనని నిపుణులు అంటున్నారు. ఇందులో అత్యంత కీలకమైనది.. 2019 పొల్లాచ్చి కేసు. ఇది అధికార పక్షానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. అనేకమంది అమ్మాయిలు, కళాశాల విద్యార్థినులపై అత్యాచారం జరిగింది. పార్టీ ఆఫీస్​ బేరర్లు ఇందులో కుమ్మకయ్యారని అన్నాడీఎంకే అనేక విమర్శలు ఎదుర్కొంది. ఇందులో.. డిప్యూటీ స్పీకర్​ పొల్లాచ్చి జయరామ్​, మంత్రి ఎస్​పీ వేలుమణి కుమారుల హస్తం ఉందని.. నక్కీరన్​ మ్యాగజైన్​ ఎడిటర్​ గోపాల్​ ఆరోపించారు. ఆ వీడియో సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని విపక్షాలు ఆరోపించాయి.

ఇదీ చూడండి:- తమిళనాడు ఎమ్మెల్యేల నేరచరితపై ఏడీఆర్​ నివేదిక

శశికళ మాటేంటి..?

సీఎం పీఠానికి పన్నీర్​సెల్వం నుంచి గట్టి పోటీ ఎదురైనప్పుడు.. శశికళ మద్దతుతో బయటపడ్డారు పళనిస్వామి. అప్పట్లో.. పార్టీపై శశికళ పట్టు అలాంటిది. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. శశికళ జెలుకు వెళ్లారు. ఇటీవలే విడుదలయ్యారు.

శశికళతో పళనిస్వామి

శశికళతో కలిసేది లేదని పళనిస్వామి ఇప్పటికే తేల్చిచెప్పారు. ఆమె జైలు నుంచి విడుదలైన రోజే(జనవరి 17).. జయలలిత మెమోరియల్​ను ఆవిష్కరించారు. వారం రోజుల అనంతరం అమె రాష్ట్రంలో అడుగుపెట్టగా.. మెమోరియల్​ను మూసేశారు.

జయలలిత నెచ్చెలి శశికళ

ఎన్నికల ప్రచారాల్లోనూ దినకరన్​పైనే విమర్శలు చేస్తున్నారు కానీ.. శశికళను ప్రస్తావించడం లేదు పళనిస్వామి. నిజానికి ఆమెను అసలు ప్రత్యర్థిగా ఆయన భావించడం లేదు. అయితే పన్నీర్​సెల్వం.. శశికళతో చేతులు కలిపితే రాజకీయ సమీకరణల్లో భారీ మార్పులు వస్తాయన్న విషయం పళనిస్వామికి తెలుసని రాజకీయ నిపుణులు అంటున్నారు.

ఎన్ని విమర్శలు ఎదురైనా.. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ప్రజల్లో తనకంటూ ఓ ముద్రను వేసుకున్నారు పళనిస్వామి. తనని తాను రైతు బిడ్డగా అభివర్ణించుకున్నారు. ప్రజాదరణ పొందిన నేతగా ఎదిగారు. అయితే.. ఓ ప్రజాదరణ పొంది నేత.. తనపై వచ్చే విమర్శలపై ఎక్కువకాలం మౌనంగా ఉండలేరు. ఒకవేళ మౌనంగా ఉంటే ప్రజలు సహించలేరు!

ట్రాక్టర్​పై సవారీ

మరోవైపు.. 'రాజకీయ' నిచ్చెనలో పైకి ఎక్కుతున్నానని పళనిస్వామి భావిస్తున్నారని.. కానీ నిజానికి ఆయన పడిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరి పళనిస్వామి పాలనలో విజయాలను ప్రజలు గుర్తిస్తారా? ఆయన ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు? లేక.. వైఫల్యాలతో అన్నాడీఎంకే అధికారం కోల్పోతుందా? వంటి ప్రశ్నలకు సమాధానం.. ఫలితాల రోజు(మే 2)నే తెలుస్తుంది.

ఇదీ చూడండి:- అన్నాడీఎంకే కూటమికి విజయకాంత్ గుడ్​బై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.