ETV Bharat / bharat

భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్​రేప్.. ప్రైవేట్ భాగాల్లోకి కత్తి.. దళితుడు కుర్చీలో కూర్చున్నాడని.. - 12 ఏళ్ల బాలుడిపై దిల్లీలో గ్యాంగ్ రేప్

భర్త కళ్లేదుటే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు కామాంధులు. ఈ అమానవీయ ఘటన ఝూర్ఖండ్​లో జరిగింది. భార్యపై అనుమానంతో ఆమె ప్రైవేట్ భాగాలపై దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్​లో వెలుగుచూసింది. మరోవైపు, 12 ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తులు అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన దిల్లీలో జరిగింది.

palamu woman gang raped
గ్యాంగ్ రేప్
author img

By

Published : Sep 26, 2022, 2:09 PM IST

Updated : Sep 26, 2022, 2:33 PM IST

ఝూర్ఖండ్​ పాలమూలో దారుణం జరిగింది. భర్త కళ్లెదుటే ఓ మహిళపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సాత్‌బర్వా పోలీసుస్టేషన్‌ పరిధిలో శనివారం జరిగిందీ ఘటన. అత్యాచార నిందుతులందరినీ పోలీసులు అరెస్టు చేశారు.
అసలేం జరిగిందంటే.. సాత్‌బర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న బాధితురాలు.. భర్తపై కోపంతో లాతేహర్​లోని తన పుట్టింటికి బయలుదేరింది. దీంతో తన భార్యను వెతుక్కుంటూ ఆమె భర్త బైక్‌పై సాత్‌బర్వా ప్రాంతానికి చేరుకున్నాడు. నడుచుకుంటూ వెళ్తున్న భార్యను గమనించి.. ఇంటికి తిరిగిరావాలంటూ బతిమాలాడు. అదే సమయానికి బాధితురాలి బావ కూడా అక్కడికి చేరుకున్నాడు. వారిద్దరు కలిసి బాధితురాల్ని నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆరుగురు యువకులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురిని స్టోన్​క్రషర్​వైపు బలవంతంగా లాక్కెళ్లిపోయారు. బాధితురాలి భర్త, బావను తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితురాలి బావ స్పృహ తప్పిపడిపోయాడు. అనంతరం మహిళపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితులందరినీ అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.

భార్యపై అనుమానంతో..
మరోవైపు, భార్యపై అనుమానంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమెపై అసహజ శృంగారానికి పాల్పడుతుండడమే కాకుండా.. ఆమె ప్రైవేట్ భాగాలకు వేడి కత్తిని అంటించి.. పై నుంచి గమ్​ను పోశాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని షిప్రా పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. భర్త దాడిలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

12 ఏళ్ల బాలుడిపై గ్యాంగ్​రేప్​..
దిల్లీలో ఘోరం జరిగింది. 12 ఏళ్ల బాలుడిని నలుగురు వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈశాన్య దిల్లీలో సెప్టెంబరు 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. అత్యాచారం అనంతరం.. బాలుడిపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. బాధితుడి ప్రైవేట్ భాగాలను గాయపరిచారు. దీంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాలుని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడ్ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ స్వాతి మలివాల్ తీవ్రంగా స్పందించారు. పోలీసులు తక్షణమే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

దళితుడిపై దాడి..
గ్రామ పంచాయతీ కార్యాలయంలో కుర్చీపై కూర్చున్నాడని ఓ దళితుడిపై దాడికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో ఛతర్​పుర్​లోని మట్గువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. 'గ్రామ పంచాయతీ కార్యాలయంలో కుర్చీపై కూర్చున్న నా భర్తను.. రోహిత్ సింగ్ ఠాకూర్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి కొట్టాడు. తన ముందు కుర్చీ మీద దళితుడు ఎలా కూర్చొంటావని.. నా భర్తను అసభ్యపదజాలంతో దూషించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితుడిపై చర్యలు తీసుకోవట్లేదు ' అని బాధితుడి భార్య ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. బాధితుడికి, నిందితుడికి మధ్య శత్రుత్వమే ఈ దాడికి కారణమని అన్నారు. నిందుతుడిని పట్టుకుంటామని తెలిపారు.

క్షుద్ర విద్యలకు పాల్పడుతున్నారని..
ఝూర్ఖండ్ దుమ్కాలో దారుణం జరిగింది. క్షుద్ర విద్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలతో కొందరు గ్రామస్థులు బలవంతంగా మలమూత్రాన్ని తాగించారు. సరయ్యహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిందీ ఘటన. బాధితుల ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇవీ చదవండి: గులాం నబీ కొత్త పార్టీ ఖరారు.. జెండా ఆవిష్కరణ.. పేరు ఏంటంటే?

76 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా..'సీఎంపై కొత్త అధ్యక్షుడిదే నిర్ణయం'

Last Updated : Sep 26, 2022, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.