ETV Bharat / bharat

మరోసారి పాక్ దుర్నీతి.. జమ్ముకశ్మీర్​లో కాల్పులు - హిరణ్​సాగర్​

పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలు, ఫార్వర్డ్ పోస్టులు లక్ష్యంగా దాడులకు తెగబడింది.

Cease fire_Pakisthan
మరోసారి పాక్ దుర్నీతి... జమ్ముకశ్మీర్​లో కాల్పులు
author img

By

Published : Nov 7, 2020, 10:27 AM IST

నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ మరోసారి కాల్పులకు తెగబడింది. తెల్లవారుజామున 2.30 గంటలకు జమ్ముకశ్మీర్​లోని పూంఛ్​, కతువా జిల్లాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్​ ఉల్లంఘించినట్లు భారత సైన్యాధికారులు తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతమైన హిరణ్​సాగర్​ సెక్టార్​లోనూ మోర్టార్​ షెల్స్, ఆయుధాలతో పాక్​ దాడికి పాల్పడిందని పేర్కొన్నారు.

" మాన్​కోట్ సెక్టార్​లో... తెల్లవారుజామున 2.30 గంటలకు మోర్టార్​ షెల్స్​, ఆయుధాలతో పాకిస్థాన్​ దాడికి దిగింది. పాక్​ చర్యకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది".

-భారత సైన్యాధికారి.

ఉదయం 5.10 గంటల వరకు ఇరుదేశాల సైనికులు ఎదురుకాల్పులు జరిపారని, సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారని భారత సైన్యం పేర్కొంది.

ఇదీ చదవండి:29 శాతం ఆహార వస్తువులు నాసిరకమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.