Pakistani Girl Married Indian : బంగాల్లోని కోల్‌కతాకు చెందిన సమీర్ ఖాన్ జర్మనీలో చదువుకున్నాడు. 2018లో భారత్‌కు వచ్చినప్పుడు తన తల్లి ఫోన్‌లో పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన జావెరియా ఖనుమ్ ఫొటో చూశాడు. వెంటనే ఆ పాక్ యువతిపై మనసు పారేసుకున్నాడు. పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని పట్టుబట్టాడు. తల్లిదండ్రులు అంగీకరించినా వారికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. భారత్‌కు వచ్చేందుకు రెండుసార్లు జావెరీ ఖనుమ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆమె వీసా రిజక్ట్ అయ్యింది. ఈ మధ్యలో కొవిడ్ వచ్చింది. మొత్తం ఐదేళ్లు అలా గడిచిపోయాయి. ఎట్టకేలకు 45 రోజుల గడువుతో జావెరియా ఖనుమ్‌కు భారత్ వీసా దక్కింది. వాఘా-అటారీ అంతర్జాతీయ సరిహద్దు గుండా ఆ పాక్ యువతి భారత్‌లోకి అడుగుపెట్టింది. బాజా భజంత్రీల మధ్య ఆమెకు సమీర్‌ఖాన్ కుటుంబం స్వాగతం పలికింది.
![Pakistani Girl Married Indian](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-12-2023/pb-asr-pakisatanigirlatindiaviabite-pbc10054_05122023121804_0512f_1701758884_571.jpg)
"ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. రావటంతోనే చాలా ప్రేమ పంచుతున్నారు. 5 సంవత్సరాల తర్వాత ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాము. వచ్చే జనవరి మొదటి వారంలో మా వివాహం."
- జావెరియా ఖనుమ్ పాక్ యువతి
తనకు కాబోయే భార్యకు వీసా మంజూరు చేయడంపై సమీర్‌ఖాన్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఐదేళ్లు ఒకరికొకరం ఎంతో మిస్ అయ్యామని అన్నాడు.
![Pakistani Girl Married Indian](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-12-2023/pb-asr-pakisatanigirlatindiaviabite-pbc10054_05122023121804_0512f_1701758884_948.jpg)
"ఈ జనవరిలో మా వివాహం నిశ్చయమైంది. భారత ప్రభుత్వానికి, పాకిస్థాన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే మక్భూలీ మాజీకి కృతజ్ఞతలు. ఈ ప్రక్రియలో మీరందరు అండగా నిలిచారు."
- సమీర్ ఖాన్, కోల్‌కతా వాసి
భారత్‌లో అడుగుపెట్టాక అమృత్‌సర్ నుంచి కోల్‌కతాకు విమానంలో ఆ జంట చేరుకుంది. వచ్చే ఏడాది జనవరిలో జావెరీ, సమీర్‌ఖాన్ పెళ్లి జరగనుంది. జర్మనీలో తన స్నేహితులు వివిధ దేశాలకు చెందినవారని, వారందరినీ వివాహానికి ఆహ్వానిస్తున్నట్లు సమీర్‌ఖాన్ తెలిపాడు.
![Pakistani Girl Married Indian](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-12-2023/pb-asr-pakisatanigirlatindiaviabite-pbc10054_05122023121804_0512f_1701758884_986.jpg)
కొన్నాళ్ల క్రితం భారతీయ సంప్రదాయాలు, కట్టుబొట్టూ ఇష్టపడే ఓ జర్మనీ యువతి.. ఇక్కడి వ్యక్తినే ప్రేమించి పెళ్లాడింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శ్రేష్ఠ అనే యువకుడితో.. ప్రేమలో పడిన జెనిఫర్ ఖండాలు దాటొచ్చి అతడిని మనువాడింది. భారతీయ హిందూ సంప్రదాయం ప్రకారం.. ఇరువురికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. రాజస్థాన్ భరత్‌పుర్‌లోని ఓ హోటల్ ఈ పెళ్లికి వేదికైంది. జర్మనీ నుంచి వచ్చిన వధువు కుటుంబసభ్యులు కూడా ఎంతో ఆనందంగా వివాహంలో పాల్గొని చిందులేశారు. పూర్తి వార్తను చదవడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
తల్లిదండ్రులు అంగీకరిస్తేనే ప్రేమ వివాహం.. గుజరాత్లో కొత్త రూల్! రాజ్యాంగం అనుమతిస్తుందా?
పేదలకు అండగా ట్రాన్స్‌జెండర్- ఏడాదికి 10మంది యువతులకు పెళ్లిళ్లు- గత 12 ఏళ్లుగా ఇలానే!