ETV Bharat / bharat

భారత​ గగన తలంలోకి పాక్​ డ్రోన్​ - Indo Pak international border

భారత్​ గగన తలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్​ డ్రోన్​ను గుర్తించినట్లు బీఎస్​ఎఫ్​ అధికారులు తెలిపారు. అయితే అది వచ్చిన దిశగా కాల్పులు జరపగా.. వెనక్కి మళ్లినట్లు చెప్పారు.

Pakistani drone spotted in Punjab's Pathankot
భారత్​ గగనతలంలోకి పాక్​ డ్రోన్​
author img

By

Published : Mar 15, 2021, 6:13 AM IST

పాకిస్థాన్​కు చెందిన డ్రోన్​.. భారత్​ గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. దాన్ని గుర్తించిన సరిహద్దు భద్రతా సిబ్బంది కాల్పులు జరపగా.. వెనక్కి వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు. పంజాబ్​లోని పఠాన్​కోట్​ జిల్లా డిండా పోస్ట్​ వద్ద పాక్​ సరిహద్దు నుంచి వస్తున్న డ్రోన్​ను బీఎస్​ఎఫ్​ జవాన్లు ఆదివారం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది డ్రోన్​ వస్తున్న దిశగా కాల్పులు జరిపారు.

దీంతో ఆ డ్రోన్​ వెనక్కి మళ్లినట్లు వారు చెప్పారు. డ్రోన్​ నుంచి ఏమైనా జారవిడిచారనే అనుమానంతో అది వచ్చిన మార్గంలో గాలింపు జరిపామని.. అయితే ఎలాంటి వస్తువు దొరకలేదని తెలిపారు.

గతంలోనూ పాక్​ డ్రోన్​ ద్వారా భారత భూభాగంలో జారవిడిచిన ఏకే 47 తుపాకులు, తుటాలు, గ్రెనేడ్లు, నకిలీ కరెన్సీని భద్రతా సిబ్బంది గుర్తించారు.

ఇదీ చూడండి: 'ఇది వ్యాపారులు నడిపిస్తున్న ప్రభుత్వం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.