ETV Bharat / bharat

పాక్​లో ఒకరు.. భారత్​లో మరొకరు.. 75ఏళ్లకు కలిసిన సోదరులు.. ఏడాదికే ఒకరి మృతి - పాకిస్థాన్​లో మరణించిన అన్న

1947లో పాకిస్థాన్​-భారత్​ విభజన కారణంగా ఇద్దరు సోదరులు విడిపోయారు. దాదాపు 75 ఏళ్ల తర్వాత 2022లో కలిశారు. కానీ వారి సంతోషం ఎక్కువ కాలం లేదు. కలిసిన ఏడాదికే పాకిస్థాన్​లో ఉన్న సోదరుడు మరణించారు.

Pakistani Brother Dies in Pakistan
Pakistani Brother Dies in Pakistan
author img

By

Published : Jul 7, 2023, 1:14 PM IST

దేశ విభజన సమయంలో విడిపోయి.. 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఇద్దరు సోదరులలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చిన్నప్పుడు విడిపోయిన ఈ సోదరులు.. 2022లో ఇద్దరు కలుసుకుని సంతోషంగా గడిపారు. కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. మూడు రోజుల క్రితం పాకిస్థాన్​లో నివసిస్తున్న సోదరుడు సిద్దిఖీ కన్నుమూశారు.

పంజాబ్​ బఠిండాకు చెందిన సికా ఖాన్​, మహ్మద్ సిద్దిఖీ ఇద్దరు సోదరులు. 1947 దేశ విభజన సమయంలో ఇద్దరు విడిపోయారు. అప్పటికి ఆరేళ్ల వయసున్న మహ్మద్ సిద్ధిఖీ తండ్రితో పాకిస్థాన్​ ఉండగా.. మరో సోదరుడు సికా ఖాన్..​ తల్లితో కలిసి పంజాబ్​లో ఉన్న బంధువుల ఇంట్లో ఉండిపోయారు. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల పాకిస్థాన్​కు వెళ్లలేదు. ఇలా దాదాపు 75 ఏళ్లుగా ఇద్దరు సోదరులు వేర్వేరు దేశాల్లో నివసించారు.

అయితే, గతేడాది ఈ సోదరుల గురించి తెలుసుకున్న పాకిస్థాన్​కు చెందిన సోషల్​ మీడియా ఇన్​ఫ్ల్యుయెన్సర్​ నాజీర్ థిల్లాన్​ వీరిని కలిపేందుకు ప్రయత్నాలు చేపట్టారు. పాకిస్థాన్​ ఎంబసీ ద్వారా సికాకు వీసా ఇప్పించారు. 2022 జనవరిలో ఇద్దరిని కర్తార్​పుర్ కారిడార్​లో కలిపారు. అయితే, మూడు రోజుల క్రితం ఆయన సోదరుడు మహ్మద్ సిద్దిఖీ మరణించారు.

Pakistani Brothers Siddique of Sika Dies
మహ్మద్ సిద్ధిఖీ (ఎడమ), సికా ఖాన్(కుడి)

తన సోదరుడు చనిపోయారన్న విషయం తెలుసుకున్న సికా ఖాన్.. తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోదరుడి కుటుంబాన్ని చూసేందుకు పాకిస్థాన్​కు పయనమయ్యారు సికా. ఇందుకోసం దిల్లీకి వెళ్లి వీసా దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తన సోదరుడు నిండు నూరేళ్లు జీవించాలని కోరుకున్నానని.. కానీ ఆయన విధిరాత వేరేలా ఉందని సికా ఆవేదన వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్​లో సోదరి.. భారత్​లో మరణించిన సోదరుడు..
అంతకుముందు బంగ్లాదేశ్​లో మరణించిన సోదరుడిని చూసి నివాళులు అర్పించాలని ఎదురుచూసిన ఓ సోదరి కోరికను నెరవేర్చారు బీఎస్​ఎఫ్​ అధికారులు. సబర్‌ఖాన్ అనే ఓ యువతి బంగ్లాదేశ్​లో నివసిస్తోంది. అయితే భారత్​లో నివసిస్తున్న తన సోదరుడు మరణించాడనే విషయం ఆమెకు తెలిసింది. కానీ, భారత్​-బంగ్లాదేశ్ రెండు వేర్వేరు దేశాలు వేరు కావడం వల్ల ​పలు భద్రతా కారణాలతో అనేక ప్రక్రియలు దాటాలి. దీంతో సోదరుడిని చివరిసారిగా చూసేందుకు వీలు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సబర్‌ఖాన్​కు.. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉండే అమినుద్దీన్​ అనే ఓ మంచి మిత్రుడు దొరికాడు. అతడి సహకారంతో బీఎస్​ఎఫ్​ సౌత్ బంగాల్ ఫ్రాంటియర్ ప్రతినిధి ఏకే ఆర్యని కలిశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి : భారత్‌లో అక్క.. పీఓకేలో తమ్ముడు.. 75 ఏళ్ల తర్వాత కలుసుకుని కన్నీళ్లు

19 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన 'ఊర్మిళ'.. భర్తతో మళ్లీ పెళ్లి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.