ETV Bharat / bharat

ఏళ్ల నిరీక్షణకు తెర.. భర్తల చెంతకు పాక్​లోని​ భార్యలు - pakistani brides of indian grooms

పాకిస్థాన్​ యువతులను పెళ్లి చేసుకున్న ముగ్గురు రాజస్థాన్​ యువకుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం( మార్చి 8) సందర్భంగా.. వీరి భార్యలు సోమవారం రాత్రి భారత్​కు వచ్చారు. అయితే భార్యలకు ఆ భర్తలు ఎందుకు దూరం కావల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది?

Pakistani brides of Indian grooms will have enter in india via Wagah atari border on Women's Day
ఏళ్ల నిరీక్షణకు తెర.. భర్తల చెంతకు పాక్​లోని​ భార్యలు
author img

By

Published : Mar 9, 2021, 10:42 AM IST

Updated : Mar 9, 2021, 11:12 AM IST

పాకిస్థాన్​ యువతులను పెళ్లి చేసుకున్న ముగ్గురు రాజస్థాన్​ యువకుల రెండేళ్ల ఎదురు చూపులకు సోమవారం తెరపడింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం( మార్చి 8) సందర్భంగా వీరి భార్యలు సోమవారం రాత్రి అటారీ- వాఘా సరిహద్దు గుండా భారత్​కు వచ్చారు. 2019లో వీరు వివాహం చేసుకున్న నెలరోజులకే పుల్వామా ఘటన జరిగింది. అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చి వీరి భార్యలకు వీసాలు మంజూరు కాలేదు.

Pakistani brides of Indian grooms will have enter in india via Wagah atari border on Women's Day
భర్తల చెంతకు పాక్​లోని​ భార్యలు

ఏం జరిగింది?

భారత్​, పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్త పరిస్థితులున్నప్పటికీ ఇరు దేశాల సరిహద్దు రాష్ట్రాల ప్రజలు మాత్రం సత్సంబంధాలు కొనసాగిస్తుంటారు. రాజస్థాన్​కు 90 కిలోమీటర్ల దూరంలో ఉండే బాడ్మేర్​, జైసల్మేర్​కు చెందిన ముగ్గురు యువకులు 2019లో పాకిస్థాన్​ సింధ్​ రాష్ట్రంలోని యువతులను పెళ్లాడారు. నెలరోజుల పాటు అక్కడే ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన అనంతరం భారత్​, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నాయి.

ఆ ప్రభావం ఈ నూతన జంటలపై పడింది. పాకిస్థాన్​ నుంచి భారత్​కు వచ్చేందుకు ముగ్గురు యువకుల భార్యలకు ఇమిగ్రేషన్​ అధికారులు వీసాలు మంజూరు చేయలేదు. కొద్ది రోజుల పాటు అక్కడే వేచి చూసిన రాజస్థాన్​ యువకులు చేసేదేం లేక భార్యలను అక్కడే ఉంచి స్వదేశానికి వచ్చేశారు. రెండేళ్లయినా వారి భార్యలకు ఇంకా వీసాలు లభించలేదు. దీంతో తమ జీవిత భాగస్వాములు ఎప్పుడు వస్తారా? అని ముగ్గురు భర్తలు ఎదురు చేశారు.

భార్యల వీసాల కోసం ముగ్గురు యువకులు రెండేళ్లుగా ఎంత ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు భారత విదేశీ వ్యవహారాల శాఖ చొరవ తీసుకుని.. వీరి భార్యలను రాజస్థాన్​ చేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

పెళ్లి అలా జరిగింది..

జసల్మేర్​కు చెందిన విక్రమ్ సింగ్, అతని సోదరుడు నేపాల్ సింగ్​ 2019 జనవరిలో థార్​ ఎక్స్​ప్రెస్ ఎక్కి పాకిస్థాన్ వెళ్లారు. విక్రమ్ సింగ్ వివాహం జనవరి 22న, నేపాల్ సింగ్ వివాహం జనవరి 26న జరిగింది. బాడ్మేర్​కు చెందిన మహేంద్ర సింగ్ పెళ్లి కూడా ఇదే తరహాలో ఏప్రిల్​ 16న జరిగింది. వీసాల కోసం నిరీక్షించే సమయంలో నేపాల్ సింగ్​ భార్య తల్లి కూడా అయింది. ఈ దంపతుల కుమారుడి వయసు ఇప్పుడు ఏడాది దాటింది.

ఇదీ జరిగింది: కర్ణాటకలో 25కిలోల జిలెటిన్ పట్టివేత

Last Updated : Mar 9, 2021, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.