శ్రీనగర్- షార్జా విమానం(sharjah srinagar flight) తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాకిస్థాన్ నిరాకరించిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దుబాయ్ షార్జా నుంచి శ్రీనగర్ వస్తున్న గో ఫస్ట్ ఎయిర్వేస్కు చెందిన విమానం తమ భూభాగంపై ఎగిరేందుకు పొరుగు దేశం అభ్యంతరం తెలిపిందని పేర్కొన్నాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. శ్రీనగర్- షార్జా (sharjah srinagar flight) మధ్య విమాన సేవలను ప్రారంభించిన వారం రోజులకే పాక్ ఇలాంటి ఆంక్షలు విధించటం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.
"ఇది దురదృష్టకరం. 2009-2010లోనూ పాక్ ఇలాంటి దుశ్చర్యకే పాల్పడింది. ఆ సమయంలో శ్రీనగర్- దుబాయ్ విమానాన్ని అడ్డుకుంది. విమాన సర్వీసులకు మొదట అనుమతి ఇచ్చి.. తర్వాత ఆంక్షలు విధించటం సరికాదు."
-- ఒమర్ అబ్దుల్లా, కశ్మీర్ మాజీ సీఎం
ఇదే విషయంపై కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. పాక్ గగనతలం మీదుగా కశ్మీర్ విమానాలు వెళ్లేందుకు.. ఆ దేశాన్ని అనుమతి కోరటాన్ని కేంద్రం పట్టించుకోవటం లేదన్నారు.
అలాంటి సమాచారం లేదు..
మరోవైపు షార్జా(sharjah srinagar flight) నుంచి బయల్దేరిన విమానం.. షెడ్యూల్ ప్రకారమే బుధవారం ఉదయం శ్రీనగర్ చేరుకున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సంతోష్ దోకె తెలిపారు. భారత విమానానికి పాక్ అనుమతిని నిరాకరించినట్లు సమాచారం లేదన్నారు.
జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా.. షార్జా- శ్రీనగర్ మధ్య విమాన సేవలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబరు 23న ప్రారంభించారు.
ఇదీ చూడండి: 'ఇంటింటికీ టీకా'.. కరోనాపై పోరులో మోదీ నయా నినాదం