ETV Bharat / bharat

60 ఏళ్లుగా 'గుర్​మత్​' సంగీతాలాపనలో కర్తార్​సింగ్​

పంజాబ్​కు చెందిన 93 ఏళ్ల పద్మశ్రీ కర్తార్​ సింగ్.. 60 ఏళ్లుగా గుర్‌మత్ సంగీతాలాపన చేస్తున్నారు. భారతీయ సంగీతంపై ఇప్పటికే 5 పుస్తకాలు రాశారు. ఎంతోమందికి గుర్‌బానీలో శిక్షణ నిచ్చారు. ఈ సంగీత కళలో ఆయన చేసిన విశేష కృషికి గానూ.. ఠాగూర్ రతన్ పురస్కారం, భారతీయ సాహిత్య అకాడమీ అవార్డు సహా.. ఎన్నో సత్కారాలు అందుకున్నారాయన.

padmasri kartar singh
పద్మశ్రీ కర్తార్​ సింగ్​
author img

By

Published : Apr 16, 2021, 9:07 PM IST

పద్మశ్రీ కర్తార్​సింగ్​ గీతాలాపన

93 ఏళ్ల పద్మశ్రీ ప్రిన్సిపల్ కర్తార్ సింగ్.. 60 ఏళ్లుగా గుర్‌మత్ సంగీతాలాపన చేస్తున్నారు. ఎంతోమందికి గుర్‌బానీలో శిక్షణ నిచ్చారు. ఈ సంగీత కళలో ఆయన చేసిన విశేష కృషికి గానూ.. ఠాగూర్ రతన్ పురస్కారం, భారతీయ సాహిత్య అకాడమీ అవార్డు సహా.. ఎన్నో సత్కారాలు అందుకున్నారాయన. సంప్రదాయ సంగీత విభాగంలో పద్మశ్రీ పురస్కారం కూడా కర్తార్‌ సింగ్‌ను వరించింది. మలివయసులోనూ.. పూర్తి ఆరోగ్యంతో, చురుగ్గా ఉన్న ఈ పెద్దాయనే పద్మశ్రీ కర్తార్ సింగ్.

"మా ఊర్లోని వారికి సంగీతం గురించి పెద్దగా అవగాహన ఉండదు. కానీ భగవంతుడి ఆశీస్సులతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాను. గురునానక్ బాలికల కళాశాలలో 26 నుంచి 27 ఏళ్లు పనిచేశా. విద్యార్థి దశలోనే గుర్‌బానీ నేర్చుకున్నా. పుస్తకం ప్రచురితమైన కొద్దికాలంలోనే బాగా ఆదరణ దక్కించుకుంది. ఇప్పటివరకూ 7 ఎడిషన్స్ ముద్రించాం. 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా దిల్లీలో అకాడమీ అవార్డు అందుకున్నా. ఆ సమయంలో రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకున్న ఏకైక పంజాబ్ వ్యక్తిని నేనే."

-- కర్తార్ సింగ్, పద్మశ్రీ గ్రహీత

భారతీయ సంగీతంపై 5 పుస్తకాలు రాశారు కర్తార్ సింగ్. ఆ పుస్తకాల కాపీలు ఇప్పటివరకూ 42 వేలకుపైగా అమ్ముడయ్యాయి. ఓ పుస్తకమైతే 7 సార్లు ముద్రించాల్సి వచ్చింది. కర్తార్ సింగ్ ఇంట్లోని ఓ గది మొత్తం ఆయన అందుకున్న పురస్కారాలు, ప్రశంసాపత్రాలతోనే నిండిపోయి ఉంటుంది.

వ్యక్తిగతంగా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రిన్సిపల్ కర్తార్ సింగ్.. సంగీత ప్రపంచంలోనూ తనదైన ముద్రవేశారు. గుర్‌మత్ సంగీతానికే ఆయన సేవలు పరిమితం కాకుండా.. సంగీత విలువలను ఒంటబట్టించుకునేలా ఇతరులను ప్రోత్సహిస్తారు. ఇంత ఘనత సాధించినా.. నిరాడంబరంగా జీవించడమే కర్తార్ సింగ్ ప్రత్యేకత.

"కళకు గౌరవంగా రెండు ఉన్నత పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఒకటి అకాడమీ అవార్డు, రెండోది రత్న పురస్కారం. 2012లో రవీంద్రనాథ్ ఠాగూర్ 150 వ జయంతిని పురస్కరించుకుని, భారత ప్రభుత్వం 50 మందిని ఎంపిక చేసి, రత్న అవార్డులు ప్రదానం చేసింది. గుర్‌మత్‌పై 5 పుస్తకాలు రాశాను. ఎంతోమంది విద్యార్థులకు శిక్షణనిచ్చాను. అందుకే నాకీ పురస్కారం దక్కింది."

-- కర్తార్ సింగ్, పద్మశ్రీ గ్రహీత

కర్తార్ సింగ్.. మలివయసులోనూ ఎంతో చురుగ్గా ఉంటారని ఆయన కుటుంబసభ్యులు చెప్తున్నారు. సంగీతంపై ఇప్పటికీ మక్కువ పోలేదు కర్తార్‌ సింగ్‌కు.

"కర్తార్ సింగ్ వయసు 93 ఏళ్లు. ఈ వయసులోనూ చాలా చురుగ్గా ఉంటారు. కుటుంబసభ్యులు అందరితోనూ చనువుగా మెలుగుతారు. పిల్లలకు చాలా బాగా పాఠాలు చెప్తారు. జీవితంలో ఎలా ఎదగాలో నేర్పిస్తారు. నేను ఆయన కోడలిని అయినందుకు గర్వపడుతున్నా. జీవితంలో ఎంతో గౌరవప్రతిష్టలు సంపాదించుకున్నారాయన. పద్మశ్రీ పురస్కారం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది."

--అమర్‌జీత్ కౌర, కర్తార్ సింగ్ కోడలు

కర్తార్‌ సింగ్ దగ్గర శిక్షణ తీసుకున్న వందలాది మంది విద్యార్థులు.. ప్రస్తుతం శ్రీ హర్‌మందిర్ సాహిబ్‌లో సంగీత సేవకులుగా పనిచేస్తున్నారు. మరికొందరు ప్రపంచవ్యాప్తంగా గుర్‌మత్‌ను విస్తృతం చేసేందుకు కృషిచేస్తున్నారు. బతికున్నంత కాలం విద్యార్థులకు సంగీత జ్ఞానం కలిగించడం మానబోనని చెప్తున్నారు కర్తార్ సింగ్.

ఇదీ చదవండి : వంతెనపైనుంచి పడిపోయిన యువకుడు- వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.