రిజర్వేషన్ల కోసం నిరసన తెలిపేందుకు వెళ్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడం తమిళనాడులో ఉద్రిక్తతలకు దారితీసింది. వన్నియార్ సామాజికవర్గానికి 20శాతం రిజర్వేషన్ కల్పించాంటూ పట్టాలి మక్కల్ కట్చి పార్టీ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం పార్టీ చెన్నైలో నిరసనలకు పిలుపునిచ్చింది.
అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడం ఆందోళనలకు దారితీసింది. చెన్నై వెళ్తున్న వాహనాలను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకోవడం వల్ల పట్టాలి మక్కల్ కట్చి కార్యకర్తలు ఆగ్రహించారు. రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. మరి కొంతమంది సమీపంలో వెళ్తున్న రైలుపై రాళ్లురువ్వడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి.