ETV Bharat / bharat

ఆస్పత్రి బయట ఒక్కసారిగా పేలిన ఆక్సిజన్​ సిలిండర్​.. ఇద్దరు మృతి - oxygen cylinder blast in van

ఆస్పత్రి వద్ద వ్యాన్​ నుంచి ఆక్సిజన్​ సిలిండర్లు దింపుతుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కిందపడిన ఓ సిలిండర్​ పేలిపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

Oxygen cylinder exploded in Chandau
Oxygen cylinder exploded in Chandau
author img

By

Published : Dec 30, 2022, 4:57 PM IST

ఆస్పత్రి బయట ఒక్కసారిగా పేలిన ఆక్సిజన్​ సిలిండర్

ఉత్తర్​ప్రదేశ్​లోని చందౌలీ జిల్లాలో విషాదం నెలకొంది. ఓ ఆసుపత్రి బయట ఆక్సిజన్​ సిలిండర్లు అన్​లోడింగ్​ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. వారి మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని మొగల్‌సరాయ్‌లోని రవినగర్‌ ప్రాంతంలో ఉన్న దయాళ్‌ ఆసుపత్రికి ఓ వ్యాన్​లో ఆక్సిజన్​ నింపిన సిలిండర్లు వచ్చాయి. ఇద్దరు వ్యక్తులు వాటిని అన్​లోడింగ్ చేస్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ట్రాక్టర్​.. ఆక్సిజన్​ సిలిండర్లు ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. వెంటనే ఓ సిలిండర్​ కిందపడి ఒక్కసారిగా పేలిపోయింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

oxygen-cylinder-exploded-in-up-2-people-died-outside-hospital
ఘటనాస్థలిలో పోలీసులు

పేలుడు శబ్దానికి భయపడి స్థానిక ప్రజలు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.