ETV Bharat / bharat

Vaccination: 74 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ.. - కర్ణాటకలో కొవిడ్ కేసులు

కేరళలో కరోనా కేసులు(Corona cases) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 20,240 మందికి వైరస్(Covid-19 virus) నిర్ధరణ అయింది. మహమ్మారితో మరో 67 మంది మృతిచెందారు. మరోవైపు దేశంలో మొత్తం కొవిడ్ టీకా డోసుల పంపిణీ(Covid vaccination) 74 కోట్లు దాటినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Over 74 cr Covid vaccine jabs administered
టీకా డోసుల పంపిణీ
author img

By

Published : Sep 12, 2021, 10:53 PM IST

కేరళలో కొవిడ్ మహమ్మారి(Corona virus) కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం కొత్తగా 20,240 కేసులు నమోదయ్యాయి. వైరస్​ ధాటికి మరో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 22,551కు చేరింది. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17.51శాతంగా ఉంది. కేరళలో క్రియాశీల కేసుల సంఖ్య 2,22,255గా ఉన్నట్టు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

వివిధ రాష్ట్రాల్లో కేసులు ఇలా..

  • మహారాష్ట్రలో కొత్తగా 3,623 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి కారణంగా మరో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 97.04గా ఉంది.
  • కర్ణాటకలో కొత్తగా 803 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 17 మంది మృతిచెందారు.
  • ఒడిశాలో కొత్తగా 649 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వారిలో 103 మంది చిన్నారులు ఉన్నారు. కొత్తగా మరో ఆరుగురు మృతిచెందారు.
  • మిజోరాంలో తాజాగా 1,089 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. అందులో 245 మంది చిన్నారులు ఉన్నారు. వైరస్​ కారణంగా మరో ముగ్గురు మరణించారు.

దేశంలో టీకా డోసుల పంపిణీ(Corona vaccination) 74కోట్లు దాటినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. ఒక్క ఆదివారం రోజే 50,25,159 డోసులను పంపిణీ చేసినట్లు పేర్కొంది. సిక్కిం, దాద్రా నగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్, గోవా, లద్ధాఖ్​, లక్షద్వీప్​ల్లో 100 శాతం కొవిడ్ టీకా మొదటి డోసును పంపిణీ చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి: 'రెండు డోసులు తీసుకున్నా.. వారిలో యాంటీబాడీలు సున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.