Ganza Seized: బంగాల్లో మాదక ద్రవ్యాల నిరోధక శాఖ, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన సోదాల్లో 1582 కిలోల గంజాయి పట్టుబడింది. కూచ్ బెహర్ జిల్లాలోని సరిహద్దు గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 1582 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఒకరిని అరెస్ట్ చేశామని, కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. దర్యాప్తు చేపడుతున్నామన్నారు.
గూడ్స్ క్యారియర్‌లో గంజాయి.. గూడ్స్ క్యారియర్‌లో అక్రమంగా తరలిస్తున్న 1480 కేజీల గంజాయిని అసోం పోలీసులు సీజ్ చేశారు. ఆ క్యారియర్ డ్రైవర్‌ను సైతం అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం, కరీంగంజ్ జిల్లాలోని చురైబారి ప్రాంతంలో పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న గూడ్స్ క్యారియర్‌పై అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టారు. 74 చిన్న బాక్సుల్లో ప్యాక్ చేసిన 1480 కిలోల గంజాయిని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో.. ఇదే జిల్లాలో ట్రక్కులో తరలిస్తున్న 1183 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
ఇవీ చదవండి: ఆ జవాన్ హత్యకు ప్రతీకారం- ముగ్గురు ఉగ్రవాదులు హతం