2017-19 మధ్యకాలంలో 14 నుంచి 18 వయసున్న 24 వేలకుపైగా మంది చిన్నారులు(టీనేజర్లు) ఆత్మహత్య చేసుకున్నారని జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) వెల్లడించింది. వారిలో పరీక్షల్లో విఫలమయ్యారనే కారణంతో సూసైడ్ చేసుకున్నవారు 4వేలకు పైగా ఉన్నారని తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో నివేదిక సమర్పించింది ఎన్సీఆర్బీ.
ఎన్సీఆర్బీ డేటా ప్రకారం..
2017-19 మధ్యకాలంలో మొత్తం మీద 24,568మంది చిన్నారులు ఆతహత్య చేసుకొని చనిపోయారు. అందులో 13,325 మంది బాలికలున్నారు.
ఇలాంటి ఘటనలు ఏటికేడు పెరుగుతున్నాయి. 2017లో 8,029, 2018లో 8,162, 2019లో 8,377 మంది చిన్నారులు సూసైడ్ చేసుకొని ప్రాణాలు వదిలారు.
అత్యధిక సూసైడ్ మరణాల్లో మధ్యప్రదేశ్, బంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు.. తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
కారణాలు..
పరీక్షల్లో విఫలం కావడం-4,046 మంది
ప్రేమ వ్యవహారం-3,315 మంది
అనారోగ్యం-2,567 మంది
వివాహ సంబంధ పరమైనవి- 639 మంది
ఇదీ చూడండి: పెళ్లంటే భయం- కవలలు ఆత్మహత్య!