ETV Bharat / bharat

2.27 లక్షల మంది గర్భిణీలకు టీకా తొలి డోసు - గర్భీణీలకు కరోనా వ్యాక్సిన్​

దేశవ్యాప్తంగా 2.27 లక్షల మంది గర్భిణీలకు కొవిడ్​ టీకా తొలిడోసు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. శుక్రవారం వెల్లడించింది. అత్యధికంగా 78,838 మంది గర్భిణీలకు టీకాలు అందించి.. తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, మధ్యప్రదేశ్​ రాష్ట్రాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

pregnant women
గర్భిణీలకు కొవిడ్​ తొలిడోసు
author img

By

Published : Jul 30, 2021, 10:27 PM IST

కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా 2.27 లక్షల మంది గర్భిణీలకు టీకా తొలి డోసును అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యధిక 78,838 మంది గర్భిణీలకు టీకాలు వేసి.. తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్​(34,228), ఒడిశా(29,821), మధ్యప్రదేశ్​(21,842), కేరళ(18,423), కర్ణాటక(16,673) తర్వాత స్థానాల్లో ఉన్నాయని మంత్రిత్వశాఖ వివరించింది.

అలాగే గర్భిణీ స్త్రీలకు ఇన్​ఫెక్షన్​ వల్ల ప్రమాదాలు, టీకా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఇస్తున్నారని పేర్కొంది. ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా వారిలో వ్యాక్సిన్​ తీసుకోవాలా.. వద్దా అనే విషయం తెలుస్తోందని పేర్కొంది.

46 కోట్లు దాటిన వ్యాక్సినేషన్​

దేశంలో ఇప్పటివరకు 46 కోట్ల మందికిపైగా టీకాలు అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 44 లక్షల 39 వేల మందికి కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీ చేసినట్లు పేర్కొంది. మధ్యప్రదేశ్​, గుజరాత్​, రాజస్థాన్​, మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాలు కోటి మందికిపైగా టీకాలు పంపిణీ చేసినట్లు తెలిపింది.

యాచకుల కోసం ప్రత్యేక డ్రైవ్​

టీకా అందుకోవడానికి వెసులుబాటులేని.. నిరాశ్రయులు, యాచకుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్​ డ్రైవ్​ నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శలకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​. ఎన్​జీఓలు, సామాజిక కార్యకర్తలు, వలంటీర్ల సాయం తీసుకుని ఈ డ్రైవ్​ నిర్వహించాలని లేఖలో పేర్కొంది.

ఇదీ చూడండి: మళ్లీ కొవిడ్ విజృంభణ.. రాష్ట్రాల్లో కొత్త ఆంక్షలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.