బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల్లేకుండా తిరిగిన వారిలో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ నెల 15వరకు.. సుమారు 15లక్షల మందిని గుర్తించారు మహారాష్ట్రలోని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. వారి నుంచి జరిమానాల రూపంలో సుమారు రూ.30 కోట్లకుపైగా వసూలు చేసినట్టు చెప్పారు.
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా తిరిగితే రూ.200 జరిమానా విధిస్తున్నారు అధికారులు. అలా.. సోమవారం(ఈ నెల 15న) ఒక్కరోజే దాదాపు 13 వేల మంది నుంచి రూ.26,01,600 జరిమానా రూపంలో వసూలు చేశారు. ఈ రకంగా 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15వరకు.. ముంబయి నగరంలో 15.16 లక్షల మందిని గుర్తించి 30.69 కోట్లు రాబట్టినట్టు తెలిపారు.
రాష్ట్రంలో ఇటీవల కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు సీఎం ఉద్ధవ్ ఠాక్రే. లేదంటే మరోసారి లాక్డౌన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'హెచ్ఐవీ ఉందని బడి నుంచి పిల్లల బహిష్కరణ'