ETV Bharat / bharat

ఓటీటీలకు కొత్త రూల్స్​పై సుప్రీం అసంతృప్తి - aparna purohit

ఓటీటీ వేదికల నియంత్రణకు కేంద్రం తెచ్చిన నూతన మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. మార్గదర్శకాలు కాకుండా చట్టం తెచ్చే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది.

ott new guidelines
ఓటీటీ నూతన మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి
author img

By

Published : Mar 5, 2021, 2:07 PM IST

Updated : Mar 5, 2021, 2:12 PM IST

ఓటీటీల నియంత్రణకు ఇటీవల కేంద్రం తెచ్చిన మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. నూతన మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో నియంత్రణ చేయలేవని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓటీటీ నియంత్రణకు మార్గదర్శకాలు కాకుండా చట్టం తెచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు.

అరెస్టు చెయ్యొద్దు..

వివాదాస్పద కంటెంట్​ వ్యవహారంలో అమెజాన్ ప్రైమ్ అధినేత అపర్ణా పురోహిత్ మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. 'తాండవ్' వెబ్ సిరీస్​లో మతపరమైన మనోభావాలన దెబ్బతీశారని యూపీలో దాఖలైన కేసుపై సుప్రీంను ఆశ్రయించారు అమెజాన్ ప్రైమ్ అధినేత. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ దర్యాప్తునకు సహకరించాలని అపర్ణా పురోహిత్​ను ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఓటీటీల మార్గదర్శకాలపై ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.

ఇదీ చూడండి: రైల్వే ప్లాట్​ఫామ్ టికెట్ ధరలు పెంపు

Last Updated : Mar 5, 2021, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.