ETV Bharat / bharat

'మాట్లాడే స్వేచ్ఛను హరించేందుకే ఈ నియమాలు' - సామాజిక మాధ్యమాలపై కొత్త నియమాలు

సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో భిన్న స్పందనలు ఎదురవుతున్నాయి. పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఈ నియమాలు ఉన్నాయని కాంగ్రెస్​ ధ్వజమెత్తింది. అయితే.. సామాజిక మాధ్యమ సంస్థలు మాత్రం ఈ నూతన మార్గదర్శకాలను స్వాగతించాయి.

OTT guidelines an attempt to curb freedom of speech: Congress
'మాట్లాడే స్వేచ్ఛను హరించేందుకే ఈ నియమాలు'
author img

By

Published : Feb 26, 2021, 5:44 AM IST

Updated : Feb 26, 2021, 7:43 AM IST

సామాజిక మాధ్యమాల్లో సమాచార నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన నూతన నియమావళిపై రాజకీయంగా దుమారం చెలరేగింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలింగించేలా ఈ మార్గదర్శకాలు ఉన్నాయని కాంగ్రెస్​ ధ్వజమెత్తింది. ఇలాంటి చర్యలను తాము ఎంత మాత్రం సహించబోమని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేట్​ తెలిపారు.

"చిన్నారుల అశ్లీలం వంటి అసభ్యకరమైన వాటిని సామాజిక మాధ్యమాల్లో నియంత్రించే ఈ చర్యలు స్వాగతించదగినవే. కానీ, ఈ మార్గదర్శకాలను చూస్తోంటే.. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దేశ ద్రోహ ఆరోపణలు మోపుతూ ప్రభుత్వం ఆ స్వేచ్ఛను అరికట్టేందుకు యత్నిస్తూనే ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడితే మేం ఎంత మాత్రం సహించం.

-సుప్రియా శ్రీనేట్​, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి.

సామాజిక మాధ్యమ సంస్థలు ఏమన్నాయంటే..

ఈ తాజా నియమావళిని సామాజిక మాధ్యమ సంస్థలు స్వాగతించాయి. అంతర్జాల సవాళ్లను పరిష్కరించేందుకు నిర్దేశించిన మార్గదర్శకాలకు తాము ఎల్లప్పుడూ మద్దతిస్తామని సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ తెలిపింది. ఈ కొత్త నియమాలను తాము నిశితంగా అధ్యయనం చేస్తామని చెప్పింది. వినియోగదారులకు సురక్షితమైన సేవలందించేందుకు కట్టుబడి ఉంటామని, భారత్ డిజిటల్​ ట్రాన్సఫర్మేషన్​లో తాము భాగస్వాములవుతామని పేర్కొంది.

తాజా మార్గదర్శకాలపై గూగుల్​, ట్విట్టర్​ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇంటర్మీడియరీస్​ బాధ్యతలను స్పష్టం చేయడంలో కొత్త మార్గదర్శకాలు సాయపడతాయని 'కూ' సంస్థ పేర్కొంది. వినియోగదారుల ఆసక్తిని కాపాడేందుకు దోహదపడతాయని తెలిపింది. ఫిర్యాదు అందిన కంటెంట్​ మూలాలను గుర్తించడంలో కొత్త మార్గదర్శకాలు పని చేస్తాయని ఇండియాటెక్​.ఓఆర్​జీ సీఈఓ రమీశ్​ కైలాసం తెలిపారు.

చట్టాలను పాటించాల్సిందే..

అన్ని రకాల డిజిటల్​ మీడియా, ఓటీటీ వేదికలు భారత్​లో తమ వాణిజ్యం నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. కానీ, అవన్నీ తప్పనిసరిగా భారత చట్టాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

"అన్ని సామాజిక మాధ్యమ వేదికలు.. భారత చట్టాలకు కట్టబడి ఉండాలి. వినియోగదారులకు మరింత మంచి సేవలు అందించేలా ఈ కొత్త నియమాలు పని చేస్తాయి. ఈ చట్టాలను తీసుకువచ్చినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​కు అభినందనలు."

-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి.

ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, సామాజిక మాధ్యమ సంస్థలు తప్పనిసరిగా ఫిర్యాదు స్వీకరణ వ్యవస్థను రూపొందించుకోవాలి. ఇందులో ఫిర్యాదుల పరిష్కార ముఖ్య అధికారి, మరో నోడల్‌ అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. యూజర్లు చేసే ఫిర్యాదులను 24గంటలపాటు స్వీకరించే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి.

ఇదీ చూడండి:ముకేశ్​ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

Last Updated : Feb 26, 2021, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.