AIADMK: అన్నాడీఎంకే అగ్రనేత పన్నీర్‌సెల్వం సోదరుడు రాజా.. పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. పార్టీ సంబంధిత వ్యవహారాలపై వీకే శశికళతో చర్చలు జరిపినందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన సహా నియమాలకు విరుద్ధంగా పనిచేయడం వంటి కారణాలతో రాజాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు ఏఐఏడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వం, కోఆర్డినేటర్ కే పళనిస్వామి సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారంలో మరో ముగ్గరిని సస్పెండ్ చేశారు.
తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి అయిన శశకళను కొన్నేళ్ల క్రితమే అన్నాడీఎంకే నుంచి తప్పించారు. మార్చి 4న ఆమె రాష్ట్రంలోని దక్షిణప్రాంత పర్యటన చేపట్టారు. అందులో భాగంగా తన మద్దతుదారులను కలుసుకుంటున్నారు. తిరుచెండూర్‌లో శశికళను కలిసిన రాజా.. ఆమెతో పార్టీ వ్యవహారాలపై చర్చించారు.
ఇదీ చూడండి: ఓపీఎస్, ఈపీఎస్‌కు మళ్లీ కీలక పదవులు- శశికళకు ఇక కష్టాలే!