భారతీయుల డీఎన్‌ఏ ఒక్కటేనని, ముస్లింలు దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని డిమాండు చేసేవారు హిందువులే కారని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాటలను ఆచరణలో పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండు చేశాయి. భాజపా స్వాగతించింది.
"భగవత్‌జీ ఈ ప్రవచనాన్ని మీ శిష్యులకు, మోదీకి తెలియజేస్తారా? దీన్ని ఆచరించేటట్టు చేస్తే మీ అభిమానిగా మారిపోతా. హిందు-ముస్లింల మధ్య విద్వేష బీజాలు నాటిందే ఆర్‌ఎస్‌ఎస్."
-దిగ్విజయ్ సింగ్ (కాంగ్రెస్)
"ఇది రెండు నాల్కల ధోరణి. చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి."-మాయావతి (బీఎస్పీ)
"ఆవుకు, గేదెకు తేడా తెలియని వారు కూడా ముస్లిం పేరు కనబడితే చాలు గోరక్షణ పేరుతో దాడులు చేస్తున్నారు. ఈ నేరగాళ్లకు ప్రభుత్వ మద్దతు ఉంది. హిందుత్వ సిద్ధాంత ఫలితమే ఈ విద్వేషం."
-అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం)
"ఆర్‌ఎస్‌ఎస్ గురించి పెద్దలు సరిగ్గానే చెప్పారు. వారి చేసింది చెప్పరు. చెప్పేది చేయరు అని"
-పవన్ ఖేరా (కాంగ్రెస్)
"విద్వేష వ్యాఖ్యలు చేసి యువత మనసులో విషం నింపుతున్న వారిపై పోలీసు కేసు పెట్టండి."
-సోమ్‌నాథ్ భారతి(ఆప్)
"ముస్లింలపై దాడులను ఆపాలి. వీటిని ఎవరు చేస్తున్నారో చెప్పలేం. కానీ దాడులు చేసిన వారిపై చర్యలు ఉండాలి."
-ముఫ్తీ ముకరం అహ్మద్ (షాహీ ఇమాం)
"ముస్లింలపై దాడులు చేస్తున్న వారు స్వేచ్ఛగా తిరుగుతున్నప్పుడు ఇలాంటి మాటలకు అర్థం లేదు. ముస్లింలను ద్వేషిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని హోం మంత్రికి చెప్పండి.
ముక్తార్ అబ్బాస్ నక్వీ (కేంద్ర మంత్రి): ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఎల్లప్పుడూ సౌభాతృత్వం, జాతీయ వాదాన్ని పెంపునకు కృషి చేసేదే. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. సాధారణ నేరాలను కూడా మత ఘర్షణలుగా చూస్తున్నారు."-కమల్ ఫరూఖీ (ముస్లిం పర్సనల్ లా బోర్డు):
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో రాష్ట్రీయ ముస్లిం మంచ్.. ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. భారతీయులందరి డీఎన్‌ఏ ఒక్కటే అని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: 'ఆపరేషన్ కశ్మీర్ 2.0' ప్రక్రియ ప్రారంభం!
ఇదీ చూడండి: Cabinet Expansion: షాతో మోదీ భేటీ- ఏ క్షణమైనా ప్రకటన!