ETV Bharat / bharat

ఖర్గే ఇంట్లో విపక్ష నేతల భేటీ- ఉమ్మడి ర్యాలీలకు ప్లాన్​- మమత డుమ్మా! - విపక్షాల సమావేశం దిల్లీ

Opposition Meeting In Delhi : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష కూటమి ఇండియా నేతలు సమవేశమయ్యారు. ఈ సమావేశంలో 2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీను ఎదుర్కొవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇండియా కూటమి సమావేశానికి 17పార్టీలకు చెందిన నేతలు హాజరవ్వగా, టీఎంసీ నుంచి ఎవరూ హాజరుకాలేదు.

Opposition Meeting In Delhi
Opposition Meeting In Delhi
author img

By PTI

Published : Dec 6, 2023, 9:29 PM IST

Updated : Dec 6, 2023, 10:58 PM IST

Opposition Meeting In Delhi : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఇండియా కూటమిలోని 17 పార్టీలకు చెందిన నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2024లో జరగబోయే లోక్​సభ ఎన్నికల్లో కేంద్రంలోని ఎన్​డీఏ సర్కార్​ను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై బుధవారం సాయంత్రం ప్రతిపక్ష నేతలు చర్చించారు.

ఖర్గే ఇంట్లో సమావేశం
పార్లమెంట్ ఉభయసభల్లోని విపక్షాల ఫ్లోర్ లీడర్లు ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. భావసారూప్యత గల పార్టీలు దిల్లీలోని రాజాజీ మార్గ్​లోని తన ఇంట్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారని ట్వీట్ చేశారు. పార్లమెంట్​లో చర్చించాల్సిన అంశాలపై చర్చించుకున్నామని పోస్ట్​లో పేర్కొన్నారు. విపక్ష పార్టీలన్నింటితో సంప్రదింపులు జరిపిన తర్వాత తదుపరి సమావేశానికి తేదీని ఖరారు చేస్తానని అన్నారు.

  • A Parliamentary strategy meeting of like-minded parties of Lok Sabha and Rajya Sabha floor leaders was held at 10, Rajaji Marg.

    We will take up the issues of the people in the Parliament, in the remaining part of this session to make the government accountable.

    A date for… pic.twitter.com/FTcpMHtwzQ

    — Mallikarjun Kharge (@kharge) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పార్లమెంట్​లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
విపక్షాల రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్నారని కాంగ్రెస్ ఎంపీ నసీర్ హుస్సేన్ తెలిపారు. 'పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించుకున్నాం. మరికొద్ది రోజుల్లో ఇండియా కూటమి సమావేశం జరుగబోతుంది. ఒకట్రెండు రోజుల్లో సమావేశం తేదీని ప్రకటిస్తాం' అని తెలిపారు. మరోవైపు, విపక్ష కూటమిలో ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని RSP ఎంపీ ప్రేమచంద్రన్ స్పష్టం చేశారు. రాజ్యసభ, లోక్‌సభ ఫ్లోర్​ లీడర్లు ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారని త్వరలో విపక్ష కూటమి కార్యకలాపాలు మొదలవుతాయని అన్నారు.

'ఇండియా' కూటమి బలోపేతంపై దృష్టి
విపక్ష కూటమి సమావేశానికి టీఎంసీ, శివసేన(ఉద్ధవ్ వర్గం) మినహా కూటమిలోని అన్ని పార్టీలు వచ్చాయని ఐయూఎంఎల్ ఎంపీ మహ్మద్ బషీర్ తెలిపారు. మరికొద్ది రోజుల్లో లోక్​సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులు, ఇండియా కూటమి బలోపేతం గురించి చర్చించుకున్నామని అన్నారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, అధీర్ రంజన్ చౌదరి, ప్రమోద్ తివారీ, గౌరవ్ గొగొయ్​, నసీర్ హుస్సేన్​, పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ హాజరయ్యారు. జేఎంఎంకు చెందిన మహువా మాఝీ, ఎండీఎంకేకు నుంచి వైకో, ఎన్‌కే ప్రేమచంద్రన్ (ఆర్‌ఎస్‌పీ), బినోయ్ విశ్వం (సీపీఐ), లాలన్ సింగ్(జేడీయూ), రామ్ గోపాల్ యాదవ్(ఎస్పీ), జయంత్ చౌదరి(ఆర్​ఎల్డీ), వందనా చవాన్​(ఎన్​సీపీ), రాఘవ్ చడ్డా(ఆప్​), తిరుచ్చి శివ(డీఎంకే) తదితరులు ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి టీఎంసీ, శివసేన(ఉద్ధవ్ వర్గం) హాజరుకాలేదు.

మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత ఈ కూటమి సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా నిలిచిపోయిన ఉమ్మడి ర్యాలీలకు ప్లాన్ చేస్తామని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ మూడో వారంలో జరిగే విపక్ష కూటమి సమావేశానికి బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు మరింత ఊపందుకున్నాయని వెల్లడించాయి.

వార్తలపై స్పందించిన బంగాల్ సీఎం మమతా బెనర్జీ
విపక్ష కూటమిలో చీలికలు వచ్చాయన్న వార్తలపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా ఇండియా కూటమి సమావేశానికి హాజరుకాలేకపోతున్నానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. 'నాకు ముందస్తు సమాచారం లేదు. సమావేశానికి ముందురోజు మాత్రమే రాహుల్ గాందీ నాకు ఫోన్ చేసి మీటింగ్ గురించి చెప్పారు. ముందస్తు కార్యక్రమాలు ఉండడం వల్ల ఇండియా కూటమి సమావేశానికి హాజరుకాలేకపోతున్నా. త్వరలో జరిగే భేటీకి హాజరవుతాను' అని మీడియాతో మమతా బెనర్జీ చెప్పారు.

'గాంధీ, నెహ్రూల రాజకీయ చతురత రాహుల్​కు అబ్బలేదు- ఆ మాత్రం తెలియకుంటే PMO ఎలా నడుపుతారు!?'

యువతిపై దారుణం- టాలీవుడ్​ ఆఫర్ ఇప్పిస్తానని నమ్మించి కారులో గ్యాంగ్​రేప్​!

Last Updated : Dec 6, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.