ETV Bharat / bharat

పార్లమెంట్​ సమావేశాల్లో విపక్షాల అస్త్రాలు ఇవే! - rahul gandhi winter session

ధరల పెరుగుదల, చైనా చొరబాట్లు, పెగసస్ స్పైవేర్​ అంశాలపై (Parliament Winter Session 2021) కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. నవంబర్ 29 నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మోదీ సర్కార్​ను ఇరుకునపెట్టేలా వ్యూహాలు రచిస్తున్నాయి. సాగు చట్టాల రద్దుకు బిల్లు ప్రవేశపెట్టాలని విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది.

parliament winter session 2021
parliament winter session 2021
author img

By

Published : Nov 22, 2021, 7:35 AM IST

నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో (Parliament Winter Session) కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. సాగు చట్టాలు, ద్రవ్యోల్బణం, చైనా చొరబాట్లు, పెగసస్ స్పైవేర్​పై కేంద్రాన్ని నిలదీయాలని (winter session of parliament) వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ధర పెరుగుదల అంశాన్ని తప్పక లేవనెత్తుతుందని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. గత ఏడు నెలలుగా ద్రవ్యోల్బణం రేటు రెండంకెల పైనే ఉందని గుర్తు చేశారు. నిత్యావసరాల ధరలను తగ్గించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కరోనా సమయంలో సామాన్య ప్రజల కష్టాలను మరింత రెట్టింపు చేశారని ధ్వజమెత్తారు.

ప్రజలపై దాడి: రాహుల్ గాంధీ

పెగసస్ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. స్పైవేర్​ను ఉపయోగించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారనే విషయం చెప్పాలని డిమాండ్ చేశారు. జీడీపీ(గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు) పెరుగుతున్నా.. ప్రభుత్వానికి పట్టింపు లేదని ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలు పెంచేసి కేంద్రం భారీగా వెనకేసుకుందని, ఇది వినియోగదారులపై చేస్తున్న దాడేనని అన్నారు.

సాగు చట్టాలపై కేంద్రం ఇప్పటికే వెనక్కి తగ్గిన నేపథ్యంలో.. వీటిని రద్దు చేస్తూ బిల్లులను ప్రవేశపెట్టాలని విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు టీఎంసీ, సమాజ్​వాదీ, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

ఇదీ చదవండి: శీతాకాల సమావేశాల్లోనే 'సాగు చట్టాల రద్దు' బిల్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.