ఈ ఏడాది ఒక రోజు ముందే(మే 31న) నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. సాధారణంగా ప్రతి ఏడాదీ రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకుతుంటాయి.
దేశంలో రుతుపవనాలు మొట్టమొదట(మే 22న) దక్షిణ అండమాన్‌లోని సముద్ర ప్రాంతానికి చేరనున్నాయి. అనంతంరం బంగాల్ తీరం నుంచి వాయవ్య దిశగా ముందుకు కదులుతాయని ఐఎండీ పేర్కొంది.
ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని (ఐఎండీ) తెలిపింది.
ఇవీ చదవండి: కేరళకు 'తౌక్టే' ముప్పు- రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్