ETV Bharat / bharat

'చొరబాట్లను ఆపడం భాజపాతోనే సాధ్యం'

అక్రమ చొరబాట్లను ఆపటం భాజపాతో మాత్రమే సాధ్యమవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తృణమూల్​ అధినేత్రి మమతా బెనర్జీది 'నకిలీ లౌకిక వాదం' అని విమర్శించారు. విద్వేష రాజకీయాలను మమత ప్రోత్సహిస్తారని ఆరోపించారు.

amit shah
బంగాల్​లో అమిత్​ షా ప్రచారం
author img

By

Published : Apr 17, 2021, 8:01 PM IST

చొరబాట్లను భాజపా మాత్రమే ఆపగలదని ఆ పార్టీ సీనియర్​ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీది 'నకిలీ లౌకికవాదం' అని విమర్శించారు. పూర్వబర్ధమాన్​ జిల్లా అస్​గ్రామ్​, నదియా జిల్లా చాప్రాలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. చొరబాటుదారులను టీఎంసీ ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటోందని ఆరోపించారు.

"చొరబాట్లను కాంగ్రెస్​, టీఎంసీ, వామపక్షాలు ఆపలేవు. భాజపా మాత్రమే వాటిని ఆపగలదు. మమతా బెనర్జీది నకిలీ లౌకికవాదం. ఆమె తన ఓటు బ్యాంకు గురించి మాత్రమే ఆలోచిస్తారు. శవాలతో రాజకీయం చేస్తారు. విద్వేష రాజకీయలను ప్రోత్సహిస్తారు. అందుకే బంగాల్​లో హింస తీవ్రస్థాయిలో ఉంది."

-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

మతువా సామాజిక వర్గాల వారిని మమతా బెనర్జీ పట్టించుకోలేదని అమిత్ షా ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే వారికి పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ద్వారా పౌరసత్వాన్ని కల్పిస్తామని చెప్పారు. సిండికేట్లు, కట్​మనీ, సంతృప్తి రాజకీయాలు అనేవి టీఎంసీ ప్రభుత్వానికి మారుపేర్లని విమర్శించారు.

ఇదీ చూడండి: '70 ఏళ్ల కాంగ్రెస్​ కష్టాన్ని వృథా చేశారు'

ఇదీ చూడండి: బంగాల్​ పోల్స్​ : ప్రశాంతంగా ఐదో విడత పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.