తమిళనాడు తిరుపత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు తల్లిదండ్రులు మందలించారని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆన్లైన్ రమ్మీ ఆడి లక్షల రూపాయలు పొగొట్టాడని సోదరుడు సహా తల్లి మందలించగా.. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదీ జరిగింది..
జిల్లాలోని వాణియంబాడి సమీపంలోని పురుషోత్తమ కుప్పం ప్రాంతానికి చెందిన ఆనందన్(28) ఇంజనీరింగ్ పూర్తి చేసి.. చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అలాగే అతడు ఆన్లైన్లో రమ్మీ కూడా ఆడతాడు. అక్టోబరు 9న స్థానికల్లో ఓటు వేయడానికి సొంతూరు వచ్చిన ఆనందన్‌కు.. ఈ విషయమై తల్లి సహా సోదరుడు మందలించారు. రమ్మీ వ్యసనంతో లక్షలు రూపాయలు పోగొట్టాడని.. డబ్బులు అప్పు చేస్తున్నాడని.. అలాగే కుటుంబానికి కూడా ఆర్థిక సాయం చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మనస్థాపానికి గురైన ఆనందన్.. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: యూపీలో ఘోరం- 55 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్