కరోనా ప్రభావమా అని ఇప్పుడు పెళ్లిళ్ల దగ్గరనుంచి వివిధ వేడుకలు ఆన్లైన్లో నిర్వహించడం పరిపాటైపోయింది. నిత్యావసర సరకులు మొదలు రోజూవారి కార్యకలపాల్లో చాలా వరకు వర్చువల్‌గానే జరుగుతున్నాయి. ఈ సదుపాయాన్నే ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ తాను కొత్తగా కొనుగోలు చేసిన గృహప్రవేశానికి ఉపయోగించుకుంది. ఈ కార్యక్రమాన్ని ఓ పురోహితురాలు జరిపించడం విశేషం. దేశంలోని తొలి మహిళా పురోహితురాలిగా గుర్తింపు పొందిన డా.భ్రమరాంబ మహేశ్వరి ఈ తంతును నిర్వహించారు.



ఇదీ జరిగింది..
బెంగళూరుకు చెందిన దీప్తి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఇంటిని కొనుగోలు చేసింది. ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని జరపడం కోసం కర్ణాటకలోని మైసూరులో నివసించే డా. భ్రమరాంబ మహేశ్వరిని సంప్రదించింది. కరోనా వల్ల రాకపోకలపై నిషేధం ఉన్న కారణంగా.. వర్చువల్‌గా ఏర్పాటు చేశానని అంటున్నారు గృహ యజమాని దీప్తి. వీడియో కాల్ ద్వారా పురోహితురాలు ఇస్తున్న సూచనల మేరకు ఆమె ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉందంటున్నారు ఆమె.
ఆన్లైన్ ద్వారా గృహప్రవేశం జరిపించడం తనకు ఇదే తొలిసారని పురోహితురాలు డా.భ్రమరాంబ మహేశ్వరి తెలిపారు.
ఇదీ చదవండి : ప్లాస్టిక్ వ్యర్థాలతో మహాత్ముడి ప్రతిమ