ETV Bharat / bharat

వ్యాక్సినేషన్​పై పార్లమెంటరీ కమిటీ​ ఆందోళన

దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేసింది హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం. వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని.. ఇప్పటివరకు దేశంలో ఒక శాతం కంటే తక్కువ మందికే టీకా అందినట్లు తెలిపింది. ఈ వేగంతో మొత్తం జనాభాకు టీకాలు వేయడానికి కొన్నేళ్లు పడుతుందని పేర్కొంది.

author img

By

Published : Mar 16, 2021, 6:30 AM IST

Ongoing vaccination drive slow, will take years to cover entire population: Par panel
కరోనా వ్యాక్సినేషన్​పై పార్లమెంటరీ కమిటీ​ ఆందోళన

భారత్​లో కరోనా టీకా పంపిణీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం. ఈ ప్రక్రియ ఇలాగే సాగితే దేశ ప్రజలందరికీ టీకా పంపిణీ చేయడానికి కొన్నేళ్లు పడుతుందని పేర్కొంది. టీకా రెండో డోసు ఎక్కువ మంది ప్రజలకు అందడంలేదని తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో సోమవారం హోంశాఖ నిధుల డిమాండ్లపై ఇచ్చిన తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.

"కరోనా టీకా పంపిణీ ప్రక్రియను కమిటీ గమనిస్తోంది. ఇప్పటివరకు భారత జనాభాలో 1 శాతం కంటే తక్కువ మందికే వ్యాక్సిన్​ అందింది. ఈ రేటు ప్రకారం.. మొత్తం జనాభాకు టీకాలు వేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది" అని నివేదికలో పేర్కొంది.

ఇది పెద్ద సమస్య అని.. ప్రపంచంలోని పలు దేశాల్లో వెరియంట్​ వైరస్​లు వెలుగుచూస్తున్న నేపథ్యంలో చాలా మందికి రెండో డోసు అందడంలేదన్నారు ప్యానెల్​ అధ్యక్షుడు, కాంగ్రెస్​ ఎంపీ ఆనంద్​ శర్మ.

వైద్య సిబ్బంది, ఫ్రంట్​లైన్ వర్కర్స్​, కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్రాల్లో పోలీసు దళాలకు ముందుగా టీకా అందించాలని.. వీలైనంత త్వరగా దేశ ప్రజలందరికీ టీకా పంపిణీ చేయాలని కమిటీ సూచించింది.

ఇదీ చూడండి: 'చైనా సరిహద్దులో 59 రహదారుల అనుసంధానం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.