ETV Bharat / bharat

ఉమెన్స్​ డే స్పెషల్​- అంబులెన్స్‌కు తొలి మహిళా డ్రైవర్‌ - కేరళలో తొలి మహిళా అంబులెన్స్​ డ్రైవర్​

First Women Ambulance driver: మారుతున్న కాలంలో పురుషులతో సమానంగా సత్తా చాటుకుంటున్నారు మహిళలు. అవని నుంచి అంతరిక్షం వరకు దేనిలోనూ తీసిపోమంటూ సై అంటున్నారు. అదే క్రమంలో అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలపడంలో కీలక పాత్ర పోషించే అంబులెన్స్‌కు డ్రైవర్‌గా పని చేసేందుకు సిద్ధమయ్యారు ఓ కేరళ మహిళ. మహిళా దినోత్సవం రోజునే ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. కేరళలో ప్రభుత్వ అంబులెన్స్‌కు ఈమె మొదటి మహిళా డ్రైవర్‌ కావడం విశేషం.

first Women ambulance driver in Kerala
first Women ambulance driver in Kerala
author img

By

Published : Mar 8, 2022, 9:01 AM IST

Updated : Mar 8, 2022, 3:55 PM IST

First Women Ambulance driver: అంబులెన్స్ డ్రైవర్‌ అంటే కఠినమైన పరిస్థితుల్లో అత్యంత వేగంతో, ఏకాగ్రతతో వాహనాన్ని నడపాల్సి ఉంటుంది. దీనికి సాధారణంగా పురుషులే డ్రైవర్‌గా పనిచేస్తారు. కానీ ఈ పనికి నేను సైతం అని సిద్ధమయ్యారు కేరళలోని కొట్టాయం జిల్లా మెమురీ గ్రామానికి చెందిన దీపా మోల్ అనే మహిళ.

Deepa Mol
అంబులెన్స్​ నడుపుతున్న దీపా మోల్​

దీపా మోల్‌కు ఆది నుంచి ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చేయాలని ఆసక్తి. ఈ ఆసక్తే ఆమెను అంబులెన్స్‌ డ్రైవర్‌గా పని చేసే దిశగా నడిపించింది. ప్రయాణాలు కూడా ఇష్టం కావడం వల్ల 2008లో డ్రైవింగ్ లైసెన్స్‌ కూడా పొందారు. అయితే ఆమె భర్త ఆనారోగ్యానికి గురవడం వల్ల కుటుంబ పోషణ కోసం ఆమె డ్రైవింగ్‌ వృత్తిలోకి దిగక తప్పలేదు. మొదట ట్యాక్సీ డ్రైవర్‌గా, లారీ డ్రైవర్‌గా అలాగే డ్రైవింగ్ శిక్షకురాలిగా కూడా దీప పని చేశారు. అయితే ఇతరులకు సేవ చేయాలన్న ఆసక్తి గల దీప.. అంబులెన్స్‌ డ్రైవర్‌గా పని చేయాలని భావించారు. తన ఆసక్తిని తెలుపుతూ కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌కు విజ్ఞప్తి చేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి ఆమె విజ్ఞప్తికి అంగీకరించారు. మహిళా దినోత్సవం రోజే ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు. తద్వారా ప్రభుత్వ అంబులెన్సును నడుపుతున్న తొలి మహిళగా ఘనత సాధించారు.

Deepa Mol
అంబులెన్స్‌ వద్ద దీపా మోల్​

దీపా మోల్‌కు దూర ప్రయాణాల పట్ల కూడా ఆసక్తి. 2021లో ఆమె కేరళలోని కొట్టాయమ్ నుంచి జమ్ముకశ్మీర్‌లోని లద్దాఖ్ వరకు ఆమె బైక్‌పై ప్రయాణం చేశారు. 16 రోజుల్లో ఆమె ఈ ప్రయాణాన్ని పూర్తి చేశారు. త్రిస్సూర్ జిల్లా కున్నామ్‌కులంలో జరిగిన ఆఫ్-రోడ్ జీపు రైడింగ్ పోటిల్లో సైతం దీప విజేతగా నిలిచారు.

మహిళలు ఇంటిపని, వంట పనికే పరిమితం కారాదని, నచ్చిన రంగాల్లో పని చేయాలని సూచిస్తున్నారు దీపా మోల్. అవసరం వస్తే ఆత్మవిశ్వాసంతో పని చేస్తూ ఎవరిపై ఆధారపడకుండా నచ్చిన రంగాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: పైలట్ చాకచక్యం వల్లే ప్రమాదం తప్పింది: దీదీ

Last Updated : Mar 8, 2022, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.