దేశంలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి అందరూ ఏకం కావాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. దేశ రాజ్యాంగం, ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఐక్యం కావాలని కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో సోనియా అన్నారు. స్వతంత్ర్యానికి ముందులానే దేశంలో గడ్డుకాలం నడుస్తోందని వ్యాఖ్యానించారు.
పార్టీ ఏర్పడి 135ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నేతలకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన సోనియా.. దేశభక్తి, నిర్భయత, నిస్వార్థత, మానవత్వం, సోదరభావం, దేశం పట్ల నిస్వార్థ సేవ, ఐక్యత, సమగ్రతతో విలువలను సాధించడంలో స్వాతంత్య్ర సంగ్రామం నుంచి ఇప్పటివరకు పార్టీ ఎన్నో గొప్ప విజయాలు సాధించిందన్నారు. కురువృద్ధ పార్టీ దేశంలో బలమైన పునాదులు వేయడానికి సహాయపడిందన్నారు.
"స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో ప్రజా ఆందోళనలో భాగంగా ఆవిర్భవించిన పార్టీ.. ఎన్నో ఒడుదొడుకులను చూసింది. దేశ సేవలో భాగంగా లాఠీదెబ్బలు, జైళ్లుకు వెళ్లడం, గొప్ప త్యాగాలు మధ్య స్వాతంత్య్రం సాధించడమనే లక్ష్యాన్ని చేరుకోవడంలో కాంగ్రెస్ విఫలమవలేదు" అని సోనియా పేర్కొన్నారు.
"అయితే, ఈ రోజు మళ్లీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజల హక్కులకు కాలం చెల్లిపోతోంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థలు అంతరించుపోతున్నాయి. దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుంది. రైతులు, పంట పొలాలపై దాడులు జరుగుతున్నాయి. దేశంలోని 'అన్నదాతల'పై నల్ల చట్టాలు విధించిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో, దేశాన్ని నియంతృత్వం నుంచి కాపాడేందుకు పోరాడటం మన బాధ్యత. ఇది నిజమైన దేశభక్తి" అని గాంధీ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
చివరి శ్వాస వరకు ప్రజా ప్రయోజానాలు కోసం పాటుపడతామన్న సోనియా.. అన్ని స్థాయిల్లో పార్టీని బలోపేతం చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు.
ఇదీ చూడండి: 'భారతదేశమే కాంగ్రెస్కు తొలి ప్రాధాన్యం'