ETV Bharat / bharat

రెండు గంటల్లోపు ప్రయాణమైతే ఆహారం బంద్​!

రెండు గంటల కంటే తక్కువ సేపు ఉండే.. విమాన ప్రయాణాల్లో ప్రయాణికులకు ఆహారాన్ని అందించటంపై నిషేధం విధిస్తూ పౌర విమానాయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది.

flights
రెండు గంటల్లోపు ప్రయాణమైతే ఆహారం బంద్​!
author img

By

Published : Apr 12, 2021, 10:44 PM IST

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో.. పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు గంటల కంటే తక్కువ సేపు సాగే విమాన సర్వీసుల్లో ప్రయాణికులకు ఆహారం అందించటంపై నిషేధం విధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం గురువారం నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

లాక్​డౌన్​ అనంతరం గతేడాది మే 25 నుంచి దేశీయ విమాన సేవలను ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ఆ సమయంలో.. విమానాల్లో ఆహార అదించేందుకు విమానయాన సంస్థలకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అయితే.. దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గతేడాది జారీ చేసిన ఉత్తర్వులపై విమానయాన శాఖ సమీక్ష నిర్వహించింది. అనంతరం.. రెండు గంటల కంటే తక్కువ సేపు ఉండే ప్రయాణాల్లో ఆహారాన్ని అందించటంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్​- జేసీబీలతో సమాధుల తవ్వకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.