ETV Bharat / bharat

Omicron Variant:​ ఒమిక్రాన్​పై షాకింగ్​ విషయాలు- జాగ్రత్త పడకపోతే..! - ఒమిక్రాన్​ లక్షణాలు

Omicron Variant:​ కొవిడ్​ కొత్త వేరియంట్​.. ఒమిక్రాన్​ గురించి ఇప్పుడిప్పుడే కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ కేసులు ఇంకా పెద్ద మొత్తంలో బయటపడలేదు. ఇదే ఆందోళన కలిగిస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పుడప్పుడే ఈ వేరియంట్​పై ఓ అంచనాకు రాలేమని చెబుతున్నారు. కానీ.. డెల్టాకు మించి ప్రమాదకరమా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఒమిక్రాన్​తో రీఇన్​ఫెక్షన్​ రేటు కూడా డెల్టా, బీటా కంటే 3 రెట్లు ఎక్కువగా ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. ఆర్​ నాట్​ విలువ పెరుగుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది.

Experts express concern over Omicron cases in India, Omicron Variant
ఒమిక్రాన్​పై షాకింగ్​ విషయాలు,
author img

By

Published : Dec 3, 2021, 5:15 PM IST

ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​పై భారత్​లో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గురువారమే దేశంలో ఒమిక్రాన్​ కేసులు తొలిసారి నమోదయ్యాయి. విదేశాల నుంచి కర్ణాటక చేరుకున్న ఇద్దరికి వైరస్​ నిర్ధరణ అయింది.

అయితే.. తక్కువ కేసులే నమోదయ్యాయి కాబట్టే పరిస్థితిని అత్యంత జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు ఇండియన్​ సొసైటీ ఆఫ్​ ఎమర్జెన్సీ మెడిసిన్​ అధ్యక్షుడు డా. టమోరిష్​ కోలే.

''ఒమిక్రాన్​ మనకు సరికొత్త సవాల్​ విసురుతోంది. భారత్​లో ఈ వైరస్​ వెలుగు చూస్తుందని తెలుసు. ఇది అంటువ్యాధి. అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలకు కూడా ఇది సవాలే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు తక్కువ కేసులే వచ్చాయి. ఈ పరిస్థితిని జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.''

- డా. టమోరిష్​ కోలే, ఇండియన్​ సొసైటీ ఆఫ్​ ఎమర్జెన్సీ మెడిసిన్​ అధ్యక్షుడు

రోగనిరోధక శక్తిని ఒమిక్రాన్​ సమర్థంగా ఎదుర్కొంటుందన్న విశ్లేషణల తరుణంలో.. బూస్టర్​ డోసుల ఆవశ్యకతపై సార్స్​-కోవ్​-2 జీనోమిక్​ సీక్వెన్సింగ్​ కన్సార్షియం(ఇన్సాకాగ్​) కీలక వ్యాఖ్యలు చేసింది. 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్​ డోసులు వేయడం వల్ల.. రిస్క్​ తగ్గించవచ్చని అభిప్రాయపడింది. కొవిడ్​-19 మార్గదర్శకాలను అత్యంత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది.

ఇదీ చూడండి: భారత్​లో బూస్టర్​ డోస్​కు శాస్త్రవేత్తల సిఫార్సు- వారికే ముందు!

30 దేశాలకుపైగా..

ఒమిక్రాన్​ నవంబర్​ 24న దక్షిణాఫ్రికాలో తొలుత బయటపడింది. రెండు రోజులకే డబ్ల్యూహెచ్​ఓ ఈ వైరస్​ను ఆందోళనకర రకం- వేరియంట్​ ఆఫ్​ కన్సర్న్​గా(వీఓసీ) ప్రకటించింది. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకుపైగా విస్తరించింది.

కొవిడ్​-19కు కారణమయ్యే సార్స్-కోవ్​-2 వైరస్​లలో​ ఒమిక్రాన్​ వేరియంట్​లోనే ఎక్కువ మ్యుటేషన్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మొత్తం 50 మ్యుటేషన్లు ఉంటే.. కేవలం స్పైక్​ ప్రొటీన్​లోనే 32 ఉన్నట్లు గుర్తించారు.

రీఇన్​ఫెక్షన్ రిస్క్​​ ఎక్కువే..

Omicron Causes 3 Times Reinfections than Delta: ఒమిక్రాన్​ రీఇన్​ఫెక్షన్​ రిస్క్​ను పెంచుతుందని పలు ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి. మ్యుటేషన్ల కారణంగా వచ్చే నిర్మాణాత్మక మార్పుల నుంచి ఇది సంభవించొచ్చని నిపుణులు అంటున్నారు.

  • "డెల్టా, బీటా వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్​ మూడు రెట్లు ఎక్కువ రీఇన్​ఫెక్షన్లు కలిగించే అవకాశం ఉంది." -- దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల అధ్యయనం నివేదిక సారాంశం

దక్షిణాఫ్రికాలో ఈ కేసులు ఇప్పుడు క్రమక్రమంగా పెరుగుతుండటం కూడా గమనించొచ్చు. నవంబర్​ 27 నాటికి అక్కడ 28 లక్షల మందికిపైగా కరోనా బారినపడగా.. వీరిలో 35 వేల మంది రీఇన్​ఫెక్షన్​కు గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఒకసారి కరోనా సోకిన తర్వాత ఏర్పడే రోగనిరోధకత నుంచి తప్పించుకోగలిగే సామర్థ్యం ఒమిక్రాన్​కు ఉందా? లేదా? అనే విషయంపై జరిగిన తొలి అధ్యయనం ఇదే కావడం గమనార్హం. ఈ అధ్యయనాన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.

ఒకసారి కరోనా సోకి దాని నుంచి కోలుకున్న 90 రోజులకు తిరిగి పాజిటివ్​గా తేలితే దీనిని రీఇన్​ఫైక్షన్​గా పరిగణిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఒమిక్రాన్​ను కట్టడి చేసేందుకు ప్రపంచస్థాయి ఒప్పందం అవసరం'

ప్రమాదకరంగా ఆర్​ నాట్​ విలువ..

R NOT Factor in Omicron

వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్​ నాట్​గా పేర్కొంటారు.

ఒమిక్రాన్​ ఆర్​ నాట్​ విలువ దక్షిణాఫ్రికాలో ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వ్యాప్తిని అడ్డుకోవడం మరింత కష్టం కానుంది.

  • దక్షిణాఫ్రికాలో నవంబర్‌ 16న కేవలం 136 కరోనా కేసులు వచ్చాయి.
  • ఒమిక్రాన్​ను గుర్తించిన రెండు రోజులకు అంటే.. నవంబర్​ 26న రోజువారీ కేసులు 3 వేలు దాటాయి.
  • డిసెంబర్​ 1న ఈ సంఖ్య 8 వేలు దాటింది.
  • దీనిని బట్టే ఆర్​ నాట్​ విలువ భారీగా పెరిగిందని చెప్పొచ్చు.
  • సౌతాఫ్రికాలో మొత్తంగా చూస్తే ఆర్​ నాట్​ 1.47గా ఉన్నట్లు గుర్తించారు. అయితే.. ఈ విలువ 1 దాటడం ఏ మాత్రం మంచిది కాదు.

అంటు వ్యాధులను కనుమరుగు చేయడానికి కొంతకాలం పాటు ఆర్‌ నాట్‌ విలువను 1కంటే తక్కువగా ఉంచడం చాలా అవసరం. దీని విలువ తగ్గిస్తే వ్యాధిపై పట్టు సాధించినట్లే. ఇది 1 కంటే తక్కువగా ఉంటే.. వ్యాధి అదృశ్యమవుతుందని 2003లో వ్యాపించిన సార్స్‌ ఇన్ఫెక్షన్‌ ఘటన తెలియజేస్తోంది.

డెల్టా కంటే ప్రమాదమా?

Omicron Dangerous than Delta: డెల్టా వేరియంట్​.. భారత్​లో కరోనా రెండో దశకు దారితీసింది. కేసులు రోజుకు లక్షల్లో వెలుగుచూశాయి. అల్ఫా వేరియంట్​ కంటే.. 40-60 శాతం, మొట్టమొదట చైనాలో వెలుగుచూసిన ఒరిజినల్​ సార్స్​-కోవ్​-2 వైరస్​ కంటే రెట్టింపు వేగంతో డెల్టా సంక్రమించింది.

మరి ఇప్పుడు ఎక్కువ మ్యుటేషన్లు ఉన్న కారణంగా ఒమిక్రాన్​.. డెల్టాను అధిగమిస్తుందా? అంటే ఇప్పుడే ఓ అంచనాకు రావడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.

  • కానీ ఇక్కడే ఓ ఆందోళనకర విషయం బయటపడింది. వైరస్​ కణాల్లోకి చొచ్చుకెళ్లే స్పైక్​ ప్రొటీన్​లోని రిసెప్టర్​ బైండింగ్​ డొమైన్​లో ఒమిక్రాన్​ 10 మ్యుటేషన్లు కలిగి ఉంది. అదే డెల్టాలో ఈ సంఖ్య రెండు మాత్రమే.

మరోవైపు.. ప్రస్తుతానికి భారత్​లో ఒమిక్రాన్​ కేసులు ఎక్కువగా నమోదుకానందున డెల్టానే ఈ వేరియంట్​ కంటే ప్రమాదకరమైనదిగా భావిస్తున్నట్లు చెప్పారు మెడిసిన్​ అకాడమిక్​ గిల్డ్​ అధ్యక్షురాలు డా. సునీలా గార్గ్​.

ముగింపు మాత్రం కాదు..

''ఒమిక్రాన్​ అనేది ఎండ్​గేమ్​ ఎంత మాత్రం కాదు. సార్స్​-కోవ్​-2 వేరియంట్లు వస్తూనే ఉంటాయి. మనుషుల్లో వైరస్​ వ్యాప్తి చెందినంత కాలం.. మరిన్ని వేరియంట్లు వస్తాయి. ఇవి డెల్టా కంటే ప్రమాదకరంగానూ మారొచ్చు.''

- వైద్య నిపుణులు

టీకాలే శరణ్యం..

ఇప్పటివరకు వైరస్​లను అడ్డుకునేందుకు టీకాలు అత్యంత ప్రధాన పాత్ర పోషించాయి. ఇకముందూ ఇదే ఉంటుంది. వ్యాక్సినేషన్​ రేట్లు తక్కువగా ఉన్న దేశాల్లో కేసులు పెరుగుతుండటం మనం గమనించవచ్చు. అక్కడ వైరస్​ సంక్రమించేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

చివరగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే.. వ్యాక్సిన్​ ఒక్కటే వైరస్​ సంక్రమణ, కొత్త వేరియంట్ల ఆవిర్భావానికి అడ్డుకట్ట వేయగలదు.

  • కాబట్టి.. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకా తీసుకోవడం తమ బాధ్యతగా భావించాలి.
  • కరోనా నిబంధనలు తూ.చ. తప్పకుండా పాటించాలి.

ఇవీ చూడండి: Omicron India: ఒమిక్రాన్​ గుబులు- భారత్​లో దాని తీవ్రత ఎంతంటే?

Omicron treatement: గుడ్​ న్యూస్​.. ఒమిక్రాన్​కు చికిత్స రెడీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.