ETV Bharat / bharat

'పారాసెటమాల్, విటమిన్ మాత్రలతో ఒమిక్రాన్​ రోగులకు చికిత్స'

Omicron treatment: కేవలం మల్టీ విటమిన్​ ట్యాబ్లెట్లు, పారాసెటమాల్​నే ఒమిక్రాన్ చికిత్సకు ఉపయోగిస్తున్నట్లు దిల్లీ ఆస్పత్రిలోని సీనియర్ వైద్యులు తెలిపారు. ఈ వేరియంట్ బారినపడిన 90శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కన్పించడం లేదన్నారు. అందుకే వారికి ఇతర ఔషధాలు ఇవ్వాల్సిన అవసరం రాలేదని స్పష్టం చేశారు.

Omicron treatment, ఒమిక్రాన్ చికిత్స
ఒమిక్రాన్ చికిత్స
author img

By

Published : Dec 24, 2021, 3:27 PM IST

Omicron treatment: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బారినపడిన రోగులకు కేవలం మల్టీ విటమన్​ ట్యాబ్లెట్లు, పారాసెటమాల్​తోనే చికిత్స అందిస్తున్నట్లు దిల్లీలోని లోక్​నాయక్​ హాస్పిటల్​ సీనియర్ వైద్యులు వెల్లడించారు. వారికి మరే ఇతర ఔషధాలు ఇవ్వాల్సిన అవసరం రాలేదన్నారు.

ఇప్పటివరకు మొత్తం 40మంది ఒమిక్రాన్​తో ఈ ఆస్పత్రిలో చేరారు. వీరిలో 19 మంది డిశ్చార్జి కూడా అయ్యారు.

ఒమిక్రాన్​ సోకిన వారిలో 90శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని వైద్యులు చెప్పారు. మిగతా వారికి గొంతునొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలున్నాయని వివరించారు.

" ఒమిక్రాన్​ బారినపడిన వారిలో దాదాపు అందరూ విదేశాల నుంచి వచ్చిన వారే. ఎయిర్​పోర్టులో పరీక్షలు చేయగా వారికి పాజిటివ్​గా తేలింది. దాదాపు అందరూ రెండు డోసుల టీకా తీసుకున్నారు. ముగ్గురు, నలుగురు బూస్టర్​ డోసు కూడా తీసుకున్నారు.'

-ఎల్​ఎన్​జేపీ సీనియర్ వైద్యులు

Delhi omicron news

దిల్లీలో ఎల్ఎన్​జేపీ ఆస్పత్రితో పాటు సర్ గంగారామ్​ సిటీ హాస్పిటల్​, మ్యాక్స్​ హాస్పిటల్​ సాకెత్, ఫోర్టిస్​ హాస్పిటల్​, బత్రా హాస్పిటల్​లో ఒమిక్రాన్ అనుమానిత కేసుల కోసం ఐసోలేషన్​తో ప్రత్యేక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం దిల్లీలో మొత్త 67 ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. వీరిలో 23మంది కోలుకున్నారు.

దిల్లీలో రోజుకు లక్ష కేసులొచ్చినా చికిత్స అందించేలా వైద్యపరమైన ఏర్పాట్లు చేసినట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్​ ఇప్పటికే తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నందున ఇంట్లోనే చికిత్స అందించే విషయంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రోజుకు మూడు లక్షల కరోనా టెస్టులు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బూస్టర్ డోసు అవసరమేనా? కేంద్రం ఏం చేయనుంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.