Omicron Cases in Delhi: దిల్లీలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22కి చేరింది. ప్రస్తుతం వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. రోగులెవరిలోనూ తీవ్ర లక్షణాలు కనిపించలేదని తెలిపారు. మరోవైపు.. మొత్తం పాజిటివ్‌గా తేలిన 22 మందిలో 10 మంది కోలుకున్నట్లు దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ప్రకటించారు.
దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది. ప్రస్తుత కేసులతో కలిపి దేశంలో మొత్తం ఒమిక్రాన్ సోకిన వారి సంఖ్య 83కి చేరింది.
మరోవైపు.. డిసెంబర్ 16 నాటికి.. దేశంలో మొత్తం 81 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్రం లోక్‌సభలో ప్రకటించింది. ఈ కొత్త వేరియంట్ కారణంగా ఒక్క మరణం కూడా సంభవించలేదని పేర్కొంది. ఈ మేరకు పార్లమెంటులో ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పవార్ సమాధానమిచ్చారు.
- మహారాష్ట్ర (32 కేసులు).
- రాజస్థాన్ (17 కేసులు).
- దిల్లీ (8 కేసులు).
- కర్ణాటక (8 కేసులు).
- గుజరాత్ (5 కేసులు).
- కేరళ (5 కేసులు).
- తెలంగాణ (2 కేసులు).
- ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, బంగాల్లో ఒక్కో కేసు.
ఇవీ చదవండి: