వైరల్‌గా మారిన ఆ ఫొటో..
మామిక్కా జీవితం ఒక్కసారిగా మారిపోవడానికి కారణం ఫొటోగ్రాఫర్ షరీక్ వాయాలిల్. మామ్మిక్కాను చూసి.. అతడిలో ఏదో ఉందని గమనించి అతడిని ఓవర్‌నైట్ స్టార్‌ను చేశాడు. మామ్మిక్కాను ఫొటో తీసిన షరీక్ దాన్ని తన సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్ చేశాడు . ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మామ్మిక్కా అచ్చం నటుడు వినాయకన్‌లా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో మామ్మిక్కాను ఎలాగైనా మోడల్ చేయాలని అనుకున్న షరీక్ తన వెడ్డింగ్ సూట్ కంపెనీకి మోడల్‌గా ఉండాలని కోరాడు. వెంటనే బ్యూటీ పార్లర్‌కు తీసుకెళ్లి మామ్మిక్కాకు మేకోవర్ చేసి.. సూట్ వేసి ఫొటోషూట్ తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
![OLD DAILY WAGE LABORER FROM KERALA TURNS MODEL IN THIS VIRAL PHOTOSHOOT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14480122_kerala1145523698.jpg)
![OLD DAILY WAGE LABORER FROM KERALA TURNS MODEL IN THIS VIRAL PHOTOSHOOT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14480122_kerala114.jpg)
కూలీపనిని వదులుకోను..
ఆ ఫొటోలకు విపరీతంగా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని ఇతర కంపెనీలు కూడా మామ్మిక్కాను తమ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలంటూ కబురు పంపాయి. మోడల్‌గా కొనసాగుతూనే తన కూలీ పనిని కూడా చేస్తానని.. అన్నం పెట్టిన ఆ పనిని వదులుకోనని మామ్మిక్కా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మోడల్‌గా లక్షలు సంపాదిస్తూ తన జీవితాన్ని ఒక్క రోజులో మార్చేసుకున్నాడు మామ్మిక్కా.
![OLD DAILY WAGE LABORER FROM KERALA TURNS MODEL IN THIS VIRAL PHOTOSHOOT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14480122_kerala114552369.jpg)
ఇదీ చూడండి: Accident In Jharkhand: వామ్మో.. ఇదేం యాక్సిడెంట్ గురూ..