ETV Bharat / bharat

ఏటీఎంలో చోరీలకు కొత్త వ్యూహం - new types of theft at ATM

ఏటీఎంలలో కొత్త రకం దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులను అధికారులు అప్రమత్తం చేశారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలిచ్చారు. ఇటీవలి కాలంలో 'మ్యాన్‌ ఇన్‌ ద మిడిల్‌' (ఎంఐటీఎం) దాడులు పెరుగుతున్నాయని కేంద్రం హెచ్చరించింది.

ATM robberies
ఏటీఎం దొంగతనాలు
author img

By

Published : Apr 19, 2021, 6:53 AM IST

ఏటీఎంలలో కొత్త రకం చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలిచ్చినట్లు అధికారులు తెలిపారు. 'ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌' ద్వారా భద్రతను మెరుగుపరచాలని కోరారు. ఇటీవలి కాలంలో 'మ్యాన్‌ ఇన్‌ ద మిడిల్‌' (ఎంఐటీఎం) దాడులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను హెచ్చరించింది. ఇందులో భాగంగా సైబర్‌ నేరగాళ్లు.. 'ఏటీఎం స్విచ్‌' నుంచి 'ఏటీఎం హోస్ట్‌'కు వెళ్లే సందేశాలను మార్చివేస్తున్నారని, తద్వారా అక్రమంగా నగదును విత్‌డ్రా చేస్తున్నారని తెలిపింది.

"తొలుత సైబర్‌ నేరగాళ్లు.. ఏటీఎం యంత్రం, రౌటర్‌కు మధ్య ఒక పరికరాన్ని పెడతారు. నెట్‌వర్క్‌ ద్వారా ఏటీఎంకు సంధానమై ఉండే ఆథరైజేషన్‌ హోస్ట్‌ (ఏటీఎం స్విచ్‌) నుంచి వచ్చే సందేశాన్ని మార్చే సామర్థ్యం ఈ పరికరానికి ఉంటుంది. ఆ తర్వాత నేరగాళ్లు చెల్లుబాటు కాని కార్డులను ఉపయోగించి, విత్‌డ్రాల్‌ రిక్వెస్ట్‌ను పంపుతారు. దీనికి స్పందనగా ఏటీఎం స్విచ్‌.. ‘నిరాకరణ’ (డిక్లైన్డ్‌) సందేశాన్ని పంపుతుంది. మార్గమధ్యలో నేరగాడు ఆ సందేశాన్ని అడ్డగించి, దాన్ని మారుస్తాడు. లావాదేవీని ఆమోదిస్తున్నట్లుగా నకిలీ సందేశాన్ని సృష్టిస్తాడు. దీని సాయంతో నగదు విత్‌డ్రా చేసుకుంటాడు" అని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఏటీఎం టెర్మినల్‌కు ఏటీఎం స్విచ్‌కు మధ్య కమ్యూనికేషన్‌లో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉండాలని బ్యాంకులను ఆదేశించామన్నారు. ఏటీఎం ప్రాంగణంలోని నెట్‌వర్క్‌ కేబుల్స్‌, ఇన్‌పుట్‌/ ఔట్‌పుట్‌ పోర్టులు బయటకు కనపడకుండా చూడాలని సూచించింది. రిజర్వు బ్యాంకు కూడా ఇదే రకమైన సూచనలు జారీ చేసింది. భారత సైబర్‌ భద్రతా సంస్థ 'సెర్ట్‌-ఇన్‌' డేటా ప్రకారం.. 2020లో డిజిటల్‌ బ్యాంకింగ్‌లో 2,90,445 సైబర్‌ భద్రతా ఘటనలు జరిగాయి. ఇందులో ఫిషింగ్‌, నెట్‌వర్క్‌ స్కానింగ్‌, వైరస్‌ దాడి, వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌ వంటి నేరాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: 'దిల్లీలో కొవిడ్​ రోగులకు ఆక్సిజన్​ కొరత'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.