Odisha Train Derailed : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఝార్సుగూడ నుంచి సంబల్పుర్ వెళ్తున్న మెము ప్యాసింజర్ రైలు పట్టాలపై ఉన్న గేదెను ఢీకొట్టింది. దీంతో ఓ రైలు బోగీ పట్టాలు తప్పింది. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు.
-
#WATCH | Odisha: Visuals of the MEMU passenger train which was on its way from Jharsuguda to Sambalpur in Odisha derailed today evening near Sarala after hitting a cow in Sambalpur district. https://t.co/tKoe9CHieZ pic.twitter.com/bH37K0ydHU
— ANI (@ANI) November 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Odisha: Visuals of the MEMU passenger train which was on its way from Jharsuguda to Sambalpur in Odisha derailed today evening near Sarala after hitting a cow in Sambalpur district. https://t.co/tKoe9CHieZ pic.twitter.com/bH37K0ydHU
— ANI (@ANI) November 8, 2023#WATCH | Odisha: Visuals of the MEMU passenger train which was on its way from Jharsuguda to Sambalpur in Odisha derailed today evening near Sarala after hitting a cow in Sambalpur district. https://t.co/tKoe9CHieZ pic.twitter.com/bH37K0ydHU
— ANI (@ANI) November 8, 2023
మరోవైపు డీఆర్ఎమ్ ప్రమాద స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. అనంతరం ట్రాక్‌ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలను ప్రారంభించారు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో రైళ్ల రాకపోకలకు అనుమతిచ్చారు.
-
VIDEO | A MEMU passenger train derailed reportedly after hitting a cow near Sarala in Odisha's Sambalpur district. More details are awaited. pic.twitter.com/CvZdxY3KIj
— Press Trust of India (@PTI_News) November 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | A MEMU passenger train derailed reportedly after hitting a cow near Sarala in Odisha's Sambalpur district. More details are awaited. pic.twitter.com/CvZdxY3KIj
— Press Trust of India (@PTI_News) November 8, 2023VIDEO | A MEMU passenger train derailed reportedly after hitting a cow near Sarala in Odisha's Sambalpur district. More details are awaited. pic.twitter.com/CvZdxY3KIj
— Press Trust of India (@PTI_News) November 8, 2023
పట్టాలు తప్పిన రైలు..
కొద్ది రోజుల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్ సమీపంలో సుహైల్‌దేవ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఘాజీపుర్ నుంచి దిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్‌కు వెళ్తున్న సుహైల్‌దేవ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ సహా మరో రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి.
త్రుటిలో తప్పిన ఈ పెను ప్రమాదం గురించి విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తిస్తామని ఉత్తర మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టామని.. మిగతా రైళ్ల రాకపోకలు సాధారణంగానే జరుగుతున్నాయని ఆయన చెప్పారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే రైలు ప్రయాగ్‌రాజ్ స్టేషన్ నుంచి బయలుదేరిందని.. ఆ సమయంలోనే ప్లాట్పామ్ నెంబర్ 6 వద్ద ఈ ఘటన జరిగిందని అధికారులు వివరించారు.
Bihar Train Accident : కొన్నాళ్ల క్రితం బిహార్‌లోని బక్సర్ జిల్లాలో నార్త్ఈస్ట్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(రైలు నెం-12506) పట్టాలు తప్పింది. రఘనాథ్పుర్ రైల్వే స్టేషన్లో సమీపంలో రాత్రి 9.53 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 70 మందికి గాయాలయ్యాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.