ఒడిశా పూరీ జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంపై కొందరు దుండగులు.. 20కిపైగా బాంబులు విసిరారు. ఈ ఘటనలో 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి.
భూవివాదం కారణంగా..
పూరీ జిల్లాలోని నాథపుర్ గ్రామంపై... ఓ దండగుల మూక 20 బాంబులను విసిరింది. 35 మౌజా ప్రాంతంలో ఉన్న ఓ భూవివాదం నేపథ్యంలో దుండగులు ఈ బాంబు దాడులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 30 ఇళ్లు దగ్ధమయ్యాయని చెప్పారు. పలు వాహనాలు దెబ్బతిన్నాయని, పలువురికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.
దాడి సమాచారం తెలిసిన వెంటనే... పూరీ అదనపు ఎస్పీ, ఎస్డీపీఏ, బ్రహ్మగిరి పోలీస్ స్టేషన్ ఐఐసీ గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మరోవైపు గ్రామంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసు సిబ్బందిని భారీగా మోహరించారు.
ఇదీ చూడండి: సముద్రంలో ఉండగా ఒక్కసారిగా మంటలు.. పడవలోని ఏడుగురు...