ETV Bharat / bharat

250కిలోల వెండి.. 50కేజీల పసిడితో అమ్మవారి అలంకరణ

దేవి నవరాత్రి(durga navratri) సందర్భంగా అమ్మవారి మండపాలను తొమ్మిది రోజుల్లో వివిధ రకాలుగా అలంకరిస్తారు. అందులో భాగంగా ఒడిశాలో కటక్​లో దుర్గమ్మను దాదాపు 50 కిలోల పసిడి సహా 250 కేజీల వెండితో అలంకరించారు నిర్వహకులు.​ అయితే కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నట్లు స్థానిక మున్సిపల్​ అధికారులు తెలిపారు.

Durga Navratri
పసిడితో దుర్గమ్మ అలంకరణ
author img

By

Published : Oct 12, 2021, 11:24 AM IST

పసిడి, వెండితో దుర్గమ్మ అలంకరణ

దేశవ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రి(durga navratri) ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకో విధంగా అమ్మవారిని అలంకరిస్తున్నారు నిర్వహకులు. దేవిని పుష్పాలు, వివిధ రకాల ఆకులతో చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో దుర్గమ్మను వినూత్నంగా కనిపించేలా కరెన్సీ నోట్లతో అలంకరిస్తున్నారు. ఒడిశాలోని కటక్​లో కొలువైన దుర్గమ్మను కిలోల కొద్ది బంగారం, వెండితో అలంకరించారు.

Durga Idol Decorated with Gold
బంగారంతో అలంకరించిన దుర్గమ్మ

కటక్​ చౌధురి బజార్​లోని కొలువుదీరిన దేవి విగ్రహాన్ని(durga puja) ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 250 కేజీల వెండి, 40 నుంచి 50 కిలోల బంగారంతో అలంకరించారు. ఈ బంగారు ఆభరణ అలంకరణతో ఎంతో రమణీయంగా అమ్మవారు దర్శనమిస్తోంది.

Durga Idol Decorated with Gold
ఆభరణ అలంకరణంలో అమ్మవారు
Durga Idol Decorated with Gold
పసిడితో దుర్గమ్మ అలంకరణ

అమ్మవారిని చూడటానికి పెద్దఎత్తున భక్తులు వస్తున్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నట్లు కటక్​​ మున్సిపల్​ అధికారులు​ తెలిపారు. కొవిడ్​ కేసులు ఎక్కువగా నమోదవడం వల్ల రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్​కర్ఫ్యూ అమలవుతోందని పేర్కొన్నారు.

Durga Idol Decorated with Gold
ఆభరణ అలంకరణంతో అందంగా కొలువుతీరిన అమ్మవారు

భద్రత కట్టుదిట్టం

అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిఘా నేత్రల(సీసీ కెమెరా) సాయంతో రక్షణ కల్పిస్తున్నారు.

Durga Idol Decorated with Gold
సీసీ కెమెరాలతో భద్రత

ఇదీ చూడండి: భర్త కట్టించిన దుర్గమ్మ గుడిలో ముస్లిం మహిళ పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.