ETV Bharat / bharat

93ఏళ్ల కొవిడ్ రోగికి 'సర్​ప్రైజ్' - కన్నూర్ న్యూస్ టుడే

93ఏళ్ల ఓ వృద్ధుడికి తీపి జ్ఞాపకాన్ని ఇచ్చారు ఒడిశా బలంగీర్​ కిమ్స్ ఆసుపత్రికి చెందిన వైద్య సిబ్బంది. కొవిడ్ సోకి ఐసీయూలో ఉన్న రోగికి.. పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి కొత్త ఉత్సాహాన్ని నింపారు.

ICU, birthday
ఐసీయూలో బర్త్​డే, పుట్టినరోజు వేడుక
author img

By

Published : Jun 12, 2021, 9:32 AM IST

ఐసీయూలో ఉన్న 93ఏళ్ల కొవిడ్ రోగికి సర్​ప్రైజ్​ ఇచ్చారు ఒడిశా బలంగీర్​ సిటీ కిమ్స్ ఆసుపత్రి సిబ్బంది. వృద్ధుడి బర్త్​డే వేడుకలు నిర్వహించి ఆయన జీవితంలో సంతోషాన్ని నింపారు.

గదిని అలంకరించి..

గోపబందు మిశ్రా(93) కొవిడ్​ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అయితే.. శుక్రవారం ఆయన జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలోనే పుట్టినరోజు వేడుకలు చేశారు వైద్యసిబ్బంది. గదిని అలంకరించి.. మిశ్రాను సర్​ప్రైజ్ చేశారు.

birthday in ICU
ఐసీయూలో బర్త్​డే సర్​ప్రైజ్

కొవిడ్​ రోగుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ విధంగా వేడుకలు చేశారు. మిశ్రా క్రమంగా కోలుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.

birthday in ICU
93 ఏళ్ల కొవిడ్​ రోగి పుట్టినరోజు వేడుకలు

కొవిడ్​ను జయించిన బామ్మ..

కేరళ కన్నూరుకు చెందిన 104 ఏళ్ల బామ్మ జానకియమ్మ.. కొవిడ్​ నుంచి కోలుకున్నారు. 11 రోజుల్లోనే వైరస్​ను జయించి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.

old women
కొవిడ్​ను జయించిన జానకియమ్మ

వైద్యులు, నర్సుల సహకారంతోనే ఇది సాధ్యమైందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ హర్షం వ్యక్తం చేశారు. కన్నూరు మెడికల్ కాలేజ్​ సిబ్బందికి ధన్యవాధాలు తెలిపారు. వృద్ధ వయసులో కొవిడ్​ను త్వరగా జయించి.. జానకియమ్మ పలువురికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.

old women
డిశ్చార్జ్​ అవుతున్న జానకియమ్మ

ఇదీ చదవండి:రెండేళ్లకే సిక్సర్ల మోత.. కోహ్లీలా అవ్వాలని...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.