సందేహించడానికి తగిన కారణాలు ఉంటే తప్పిస్తే ప్రత్యక్ష సాక్ష్యమే ఉత్తమమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. వైద్య పరమైన ఆధారాలకు, మౌఖిక సాక్ష్యాలకు మధ్య వైరుద్ధ్యం ఉన్నప్పుడే ప్రత్యక్ష సాక్ష్యాన్ని అనుమానించాలని జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం స్పష్టంచేసింది. నలుగురు ముద్దాయిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అపీలు సుప్రీంకోర్టులో దాఖలైంది.
ప్రాసిక్యూషన్ సాక్షితో కలిసి మోటారు సైకిల్‌పై తిరిగి వస్తున్న వ్యక్తి 2003 అక్టోబరులో హత్యకు గురయ్యారు. మారణాయుధాలకు సంబంధించి కొన్ని సాక్ష్యాలు తేడాగా ఉన్నాయంటూ నిందితుల్ని నిర్దోషులుగా హైకోర్టు ప్రకటించింది.
చీకట్లో గుర్తుపట్టడం సాధ్యం కాదేమోనన్న సంశయ లబ్ధితో తాము ఏకీభవించడం లేదని ధర్మాసనం తెలిపింది.
ఇదీ చదవండి: మధ్యవర్తిత్వమే మేలిమి మార్గం