ప్రముఖ బంగాలీ నటి, ఎంపీ నుస్రత్ జహాన్ (Nusrat Jahan).. ఆగస్టు 26న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లైన తర్వాత.. ఈ బుధవారం తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. కోల్‌కతాలోని ఓ సెలూన్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెకు.. రిపోర్టర్ల ప్రశ్నలు చికాకుతెచ్చాయి. తన బిడ్డ తండ్రి (Nusrat Jahan Husband) గురించి అడిగిన ప్రశ్నలకు.. 'నా బిడ్డకు తండ్రెవరో.. ఆ తండ్రికి తెలుసు' అని బదులిచ్చారు నుస్రత్.
బిడ్డకు తండ్రెవరో చెప్పాలని ఏ మహిళనైనా ఇలా ప్రశ్నించడం.. ఆమె వ్యక్తిత్వానికి మచ్చ తేవడమేనని ఘాటైన సమాధానమిచ్చారు.
''నాకు తెలిసి ఇదో అస్పష్టమైన, అర్థం లేని ప్రశ్న. తండ్రెవరు అని అడగడం ద్వారా.. ఆ మహిళ వ్యక్తిత్వానికే మచ్చ తెచ్చినట్లుగా ఉంది. ఆ తండ్రికి తెలుసు.. తండ్రెవరో. మేం.. ప్రస్తుతం తల్లిదండ్రులుగా మంచి అనుభూతికి లోనవుతున్నాం. నేను, యష్.. మంచి సమయం గడుపుతున్నాం.''
- నుస్రత్ జహాన్, ఎంపీ, నటి
మాతృత్వపు అనుభూతి కొత్తగా ఉందని, ఇదో కొత్త జీవితం అని చెప్పిన నుస్రత్.. తన కుమారుడి పేరు ఈషాన్ అని వెల్లడించారు.
''మీ తనయుడిని ఎప్పుడు చూడొచ్చు అన్న ప్రశ్నకు.. ''అది అతడి తండ్రిని అడగాలి. ప్రస్తుతానికి.. ఈషాన్ను చూసేందుకు ఆయన ఎవరినీ అనుమతించట్లేదు.'' అని చెప్పారు.
నిఖిల్‌తో పెళ్లి.. తెగదెంపులు..
కొన్నేళ్లు డేటింగ్ చేసిన అనంతరం.. 2019 జూన్ 19న నుస్రత్.. టర్కీ వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను వివాహమాడారు. అయితే.. నిఖిల్‌తో టర్కిష్ చట్టం ప్రకారం పెళ్లయిందని, ఇది భారత్‌లో చెల్లదని కొద్ది నెలల క్రితం ఆయనతో తెగదెంపులు(Nusrat Jahan Nikhil Jain separation) చేసుకున్నారు.
తర్వాత.. నుస్రత్ ప్రెగ్నెన్సీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలో మాజీ భర్త నిఖిల్(Nusrat Jahan husband) ప్రకటించారు. దీంతో భర్తతో విడిపోయిన నుస్రత్ గర్భవతి ఎలా అయ్యారని సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చర్చ జరిగింది.
తండ్రి యశ్ దాస్గుప్తానేనా?
కొద్దిరోజులకు నుస్రత్.. నటుడు, భాజపా నేత యశ్ దాస్‌గుప్తాతో(Nusrat Yash Relationship) డేటింగ్ చేస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. అయితే.. దీనిపై ఎప్పుడూ బహిరంగంగా స్పందించని నటి, ఆరు రోజుల క్రితం ఇన్‌స్టా పోస్ట్‌లో తన చిత్రం ఉంచి.. కర్టసీ: డాడీ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. నుస్రత్ భర్త యశ్ దాసేనని అంతా అనుకుంటున్నారు.
పెళ్లితో చిక్కులు..
నుస్రత్ పెళ్లి వ్యవహారం.. కొన్నినెలల కిందట ఆమెకు బాగానే చిక్కులు తెచ్చిపెట్టాయి. తన పెళ్లి చెల్లదని నుస్రత్.. చేసిన వ్యాఖ్యలపై భాజపా ఎంపీ సంఘమిత్ర మౌర్య అభ్యంతరం తెలిపారు. లోక్‌సభ బయోడేటాలో తనకు వివాహమైందని, భర్త పేరు నిఖిల్ జైన్ అని నుస్రత్ జహాన్ పేర్కొన్నారని గుర్తు చేశారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చూడండి: Nusrat Jahan: తల్లైన ఎంపీ- మాజీ భర్త స్పందన ఇలా...