NTA Exam Calendar 2024 : 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-ఎన్‌టీఏ ప్రకటించింది. నీట్, జేఈఈ (JEET), సీయూఈటీ, నెట్ వంటి పరీక్షల తేదీలను వెల్లడించింది.
పరీక్షల తేదీలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి..
- 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య జేఈఈ మెయిన్ మొదటి విడత (Session 1) పరీక్షలు జరగనున్నాయి. ఈ మొదటి విడత పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతాయి.
- 2024 ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య జేఈఈ మెయిన్ రెండో విడత (JEE Main Session 2) పరీక్షలు జరగనున్నాయి.
- 2024 మే 5న దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష జరగనుంది. ఇది పెన్ పేపర్/ఓఎంఆర్ విధానంలో జరుగుతుంది.
- 2024 మే 15 నుంచి 31 మధ్య యూనివర్సిటీల యూజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇది పరీక్ష కూడా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు.
- 2024 మార్చి 11 నుంచి 28 మధ్య యూనివర్సిటీల పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరగనుంది.
- 2024 జూన్ 10 నుంచి 21 మధ్య మొదటి విడత యూజీసీ నెట్ పరీక్ష జరగనుంది. ఇది కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్షే.
పరీక్షలకు సంబంధించిన మరింత సమాచారాన్ని రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన సమయంలో అభ్యర్థులకు వెల్లడిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. పరీక్షలు జరిగిన మూడు వారాల్లోపే.. కంప్యూటర్ ఆధారంగా జరిగే పరీక్షల ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొంది. నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలను అదే ఏడాది జూన్ రెండో వారంలో ప్రకటించనున్నట్లు పేర్కొంది. పరీక్షలకు సంబంధించి ఇతర పూర్తి సమాచారం కోసం తమ అధికారిక వెబ్సైట్ అయిన www.nta.ac.in సందర్శించాలని సూచించింది.
National Testing Agency : భారత ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ అధ్వర్యంలో నేషనన్ టెస్టింగ్ ఏజెన్సీ పనిచేస్తుంది. ఏటా నీట్, జేఈఈ (JEET), సీయూఈటీ, నెట్ వంటి తదితర పరీక్షలను ఇది నిర్వహిస్తుంది. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్-1860 కింద స్వతంత్ర, స్వయంప్రతిపత్తి, స్వయం-నిరంతర ప్రీమియర్ టెస్టింగ్ ఆర్గనైజేషన్‌గా ఎన్‌టీఏ పనిచేస్తుంది.
భారీగా ట్రాఫిక్ జామ్.. తల్లితో కలిసి నీట్ అభ్యర్థి పరుగు.. అయినా ఆలస్యంగానే..